Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్: ఐసీసీ 'బౌండరీ రూల్'‌పై అమితాబ్ వ్యంగ్య ట్వీట్

ICC Cricket World Cup 2019 Final : Amitabh Bachchan Mocks The ICC On ‘Boundary Count’ || Oneindia
Amitabh Bachchan mocks the ICC after England won the World Cup on ‘boundary count’

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో విజేతను ప్రకటించే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) 'బౌండరీ రూల్‌'ను పాటించడంపై బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ట్విట్టర్‌లో తనదైన శైలిలో స్పందించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో ఐసీసీ ఈ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవడంపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం విస్మయం వ్యక్తం చేయగా తాజాగా ఆ జాబితాలో ఇప్పుడు బాలీవుడ్ బిగ్‌ బీ అమితాబ్ కూడా చేరారు. ఐసీసీ బౌండరీ విధానంపై ట్విట్టర్‌‌లో తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.

"నీ వద్ద రెండు వేల రూపాయిలు ఉన్నాయనుకుందాం. నా వద్ద రెండు వేల రూపాయిలు నోటు ఒకటే ఉంటే, అప్పుడు నీ దగ్గర నాలుగు ఐదు వందల నోట్లు ఉన్నాయి. అప్పుడు ఎవరు ధనికులు అవుతారు ఐసీసీ. మీ లెక్కన నాలుగు ఐదు వందల నోట్లు ఉన్న వాడే ధనికుడు అవుతాడా?" అంటూ అమితాబ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

కాగా, ఐసీసీ రూల్స్‌పై బాలీవుడ్‌ నటుడు పరేష్‌ రావల్‌ సైతం తనదైన శైలిలో స్పందించాడు. "ధోని గ్లౌవ్స్‌ మార్చాలంటూ గగ్గోలు చేసిన ఐసీసీ, ముందు సూపర్‌ ఓవర్‌ రూల్స్‌ మార్చుకుంటే బాగుంటుంది" అంటూ ట్వీట్ చేశాడు. లార్డ్స్ వేదికగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు.

Story first published: Tuesday, July 16, 2019, 15:00 [IST]
Other articles published on Jul 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+