Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌పై కన్నేసిన అభిషేక్ బచ్చన్: క్లారిటీ ఇచ్చిన బిగ్ బి

Amitabh Bachchan denies reports of him and Abhishek eyeing IPL stakes

హైదరాబాద్: 2008 నుంచి భారత క్రికెట్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఓ డెస్టినేషన్‌గా నిలిచింది. ఐపీఎల్ ద్వారా అనేక మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి బాలీవుడ్‌కు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ టోర్నీతో భాగస్వామై ఉన్నారు.

ఇప్పటికే బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్, ప్రీతి జింటా తదితరులు ఐపీఎల్‌లో పలు ప్రాంఛైజీలకు సహ యజమానులుగా ఉన్నారు. తాజాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరుగాంచిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) లీగ్‌పై బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌ బీ ఆసక్తి కనబర్చిననట్లు వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్‌లోకి అభిషేక్

ఐపీఎల్‌లోకి అభిషేక్

చెన్నై సూపర్‌ కింగ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీలతో చర్చలు జరిపినట్లు.. సీఎస్‌కేను తీసుకునేందుకు యత్నించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఐపీఎల్‌లోకి అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ప్రవేశించనున్నారనే వార్త అటు బిగ్ బీ, ఇటు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

క్లారిటీ ఇచ్చిన బిగ్ బి

క్లారిటీ ఇచ్చిన బిగ్ బి

తాజాగా గురువారం అమితాబ్ ఈ వార్తలను కొట్టిపారేశారు. "నేను గాని నా కుటుంబ సభ్యులు ఐపీఎల్‌లో ఏ జట్టును కొనుగోలు చేయలేదు.. అలాంటి ప్రయత్నాలు కూడా చేయటం లేదు. నేను, నా కొడుకు అభిషేక్‌ ఐపీఎల్‌‌లో సీఎస్‌కేను కొనుగోలుచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం" అని అమితాబ్ పేర్కొన్నారు.

మార్చి 30న ఐపీఎల్ 2019 సీజన్

మార్చి 30న ఐపీఎల్ 2019 సీజన్

ఇప్పటికే అభిషేక్ బచ్చన్ ఇండియన్ సూపర్‌ లీగ్‌లో చెన్నయిన్ ఎఫ్‌సీ, ప్రొ కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్లలో వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్‌ని ముందుకు జరిపారు. మార్చి 30న ప్రారంభం కానున్న ఐపీఎల్ ఏప్రిల్ రెండో వారంలో ముగియనుంది.

Story first published: Thursday, January 24, 2019, 12:44 [IST]
Other articles published on Jan 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+