For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్ వస్తే నీ పని అయితది కానీ నాకు రావాలని లేదు.. పాక్ నటికి మిశ్రా ధమ్‌కీ.. ఏమాత్రం తగ్గని బ్యూటీ

Amit Mishra vs Pakistan Actress Sehar Shirvani Tweet War Goes Viral After Pak vs Afghan Match

భారత మాజీ ప్లేయర్ అమిత్ మిశ్రా ఇటీవల ట్విట్టర్‌లో చాలా చమత్కారమైన ట్వీట్లు చేస్తూ వార్తాల్లో నిలుస్తున్న సంగి తెలిసిందే. ఇక పాకిస్తాన్‌ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు ముందు ఈ లెగ్ స్పిన్నర్ ట్విట్టర్లో మరో ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆసియా కప్‌లోని సూపర్ ఫోర్‌ మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌లు పాకిస్తాన్‌ను గనుక ఓడించగలిగితే వారం మొత్తం ఆఫ్ఘనీ చాప్‌‌(ఓ రకమైన వంటకం)ని తింటానంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే అనూహ్యంగా నసీమ్ షా రెండు సిక్సులు కొట్టి చివర్లో పాకిస్థాన్‌ను గెలిపించడంతో అమిత్ మిశ్రాకు చుక్కెదురయింది. ఇక ఈ విషయమై పాకిస్థానీ నటి, సామాజిక కార్యకర్త సెహర్ షిన్వారీ గమనించి అమిత్ మిశ్రాపై కవ్వించే ట్వీట్ చేసింది. ఆమె మిశ్రా ట్వీట్‌ను ఉటంకిస్తూ.. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్థాన్‌ను ఓడించడంలో విఫలమైనందున ఆఫ్ఘన్ చాప్‌కు బదులు 'ఆవు పేడ'తో అడ్జస్ట్ అవ్వు అంటూ ట్వీట్లో పేర్కొంది.

అయితే ఆఫ్ఘన్ నటిని మిశ్రా పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఓ డిఫెరెంట్ సమాధానం పంపాడు. షిన్వారీ ట్వీట్‌ను ఉటంకిస్తూ.. పాకిస్థాన్‌కు వచ్చే ఆలోచన తనకు లేదంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్టుతో సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా పోస్టులు చేశాడు. వారిలో కొద్దిమంది కూడా సదరు నటిని ట్రోల్ చేయడానికి మిశ్రాకు సపోర్ట్‌గా ట్వీట్లు చేశారు. మిశ్రా ఉద్దేశం ప్రకారం.. నేను పాకిస్థాన్‌కు వస్తే నీ పని అయితది అని.. అయితే ఆ విషయం పాపం పాక్ నటికి అర్థం కాలేదు.

అది అర్థం కాకుండా షిన్వారీ మరోసారి 'పాకిస్తాన్‌కు ఎందుకు రావడం..? ఆవు పేడ ఇండియాలో స్టాక్ లేదా?' అంటూ మరోసారి దెప్పిపొడిచేలా ట్వీట్ చేసింది. దీనికి మిశ్రా ఎలా బదులిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే.. నెటిజన్లు ఇప్పటికే ఈ విషయమై రకరకాలుగా చర్చలు పెట్టేస్తున్నారు. పాకిస్థాన్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓటమితో.. ఆసియా కప్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించాలనే భారత్ ఆశలు గల్లంతయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్‌ను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించింది కానీ.. మ్యాచ్ చివరి ఓవర్‌లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్స్‌లు బాదిన నసీమ్ షా పాకిస్థాన్‌ను గెలిపించాడు. నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో భారత తలపడనుంది.

Story first published: Thursday, September 8, 2022, 18:30 [IST]
Other articles published on Sep 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+