Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్‌.. ఫైనల్లో సందడి చేయనున్న పాప్‌స్టార్‌ 'క్యాటీ పెర్రి'

American popstar Katy Perry to perform at 2020 Womens T20 World Cup final

ముంబై: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నమెంట్ 2020 ఫిబ్రవరి 21 నుండి మార్చి 8 వరకు జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరుగుతుంది. అయితే ఫైనల్ మ్యాచ్‌ను మరింత జనరంజకం చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా మెరుగులు దిద్దుతోంది.

ఫైనల్ మ్యాచ్‌కు క్యాటీపెర్రి:

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ప్రముఖ అమెరికన్‌ పాప్‌స్టార్‌ 'క్యాటీ పెర్రి' సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని క్యాటీ పెర్రి స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. ఓ వీడియో పోస్ట్ చేసి పెర్రి మాట్లాడారు. వీడియోలో మాట్లాడుతూ... 'మార్చి 8న జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో నాతో చేతులు కలపండి. కొన్ని రికార్డులను బద్దలు కొడదాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహిస్తూ అందరం గర్జిద్దాం' అని పెర్రి పోస్ట్‌ చేశారు.

మరింత ఆకర్షనీయం:

మరింత ఆకర్షనీయం:

మరోవైపు ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌కు పాప్‌స్టార్‌ క్యాటీపెర్రి హాజరవుతుందని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కూడా స్పష్టం చేసింది. మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పెర్రీ పాల్గొనడం పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఐసీసీ పేర్కొంది. పెర్రి రాకతో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరింత ఆకర్షనీయంగా మారనుంది.

ఐపీఎల్‌ ఐదో సీజన్‌కు కూడా:

ఐపీఎల్‌ ఐదో సీజన్‌కు కూడా:

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను పెంచడానికి ఐసీసీ పెర్రిని ఆహ్వానించినట్టు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం పెర్రి నవంబర్ 16న జరిగే వన్ ప్లస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఐదో సీజన్‌ ప్రారంభ వేడుకులకు పెర్రి హాజరైన సంగతి తెలిసిందే.

ఫిఫా ప్రపంచకప్‌లో అత్యధిక అభిమానులు:

ఫిఫా ప్రపంచకప్‌లో అత్యధిక అభిమానులు:

మహిళా ప్రపంచకప్‌ను వీక్షించడానికి ఇప్పటివరకు నేరుగా స్డేడియానికి వచ్చిన అత్యధిక అభిమానుల సంఖ్య 90,185. 1999లో జరిగిన కాలిఫొర్నియా, పసడేనా జట్ల మధ్య జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లో అత్యధిక అభిమానుల సంఖ్య నమోదైంది. మహిళా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న మెల్‌బోర్న్‌ స్టేడియం సీట్ల సామర్థ్యం లక్ష. వీటన్నింటిని నింపే ప్రయత్నం చేస్తోంది ఐసీసీ. వచ్చేఏడాది పురుషుల ప్రపంచకప్ కూడా ఆస్ట్రేలియాలోనే జరగనుంది.

Story first published: Wednesday, November 13, 2019, 12:04 [IST]
Other articles published on Nov 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+