Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: తొలి బంతికే గోల్డెన్ డకౌట్

Ambris creates unwanted Test history after hit-wicket on debut

హైదరాబాద్: టెస్టు క్రికెట్ చరిత్రలోనే వెస్టిండిస్ క్రికెటర్ సునీల్ అంబ్రీస్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్ అరంగేట్రం మ్యాచ్‌లోనే తొలిబంతికి హిట్ వికెట్‌(గోల్డెన్‌ డక్‌)గా ఔటైన తొలి క్రికెటర్‌గా అంబ్రీస్ అరుదైన గుర్తింపు పొందాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది.

కివీస్ బౌలర్ నీల్ వాగ్నర్ బంతిని ఆడబోయిన అంబ్రీస్... కొద్దిగా వెనక్కిఒరిగి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి కాలు వెనకనున్న వికెట్లకు తగడంతో గోల్డెన్ డక్‌గా ఔటై పెవిలియన్‌కు చేరాడు. అరంగేట్రం టెస్టులో గోల్డెన్ డక్‌గా ఔట్ అయిన వారి జాబితాలో అంబ్రీస్ 63వ స్థానంలో ఉన్నాడు.

తాజాగా ఇప్పుడు అంబ్రీస్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డు వెస్టిండిస్‌కు చెందిన సీఎస్‌ బాహ్‌ పేరిట ఉండగా ఇప్పుడు అంబ్రీస్ దానిని అధిగమించాడు. సీఎస్‌ బాహ్‌ 2003లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులకే హిట్‌ వికెట్‌‌గా వెనుదిరిగాడు.

ఇదిలా ఉంటే 2003లో స్టీవ్ వా కూడా హిట్ వికెట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 29న అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టిన అంబ్రీస్ కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టుతో అరంగేట్రం చేశాడు. టెస్టు క్రికెట‌లో తాను ఎదుర్కొన్న తొలిబంతికే ఇలా డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్... వెస్టిండిస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే కివీస్ బౌలర్ నీల్ వాగ్నర్ దెబ్బకు వెస్టిండిస్ టాపార్డర్ కుప్పకూలింది. నీల్ వాగ్నర్ (7-39) రాణించడంతో వెస్టిండిస్ 45.4 ఓవర్లు ఆడి 134 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లు ఆడి 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 49 పరుగులు వెనుకబడి ఉంది.

Story first published: Friday, December 1, 2017, 14:31 [IST]
Other articles published on Dec 1, 2017
Read in English: Ambris creates Test history
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+