Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: కావ్య పాపకు అంబటి రాయుడు స్పెషల్ అడ్వైస్!!

విధ్వంసానికి మారుపేరు.. దూకుడుకు పర్యాయ పదం సన్‌రైజర్స్‌ హైదారాబాద్. అలాంటిది.. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయాలను అందుకోలేక సతమతమవుతోంది. పేలవ ప్రదర్శనతో చతికిలపడింది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో వరుసగా ఓడింది. జట్టులోని విధ్వంసకర బ్యాటర్లంతా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్, హెన్రిచ్ క్లాసెన్ సహా ఇతర బ్యాటర్లంతా తక్కువ పరుగులకే వెనుదిరుగుతున్నారు. అయితే మాజీ ప్లేయర్ అంబటి రాయుడు మాత్రం సన్ రైజర్స్ ఓటమికి అసలు కారణం బ్యాటింగ్ వైఫల్యం కాదని అన్నాడు. మధ్య ఓవర్లలో బౌలింగ్ బలహీనతే SRH ఓటమికి కారణమని అభిప్రాయపడ్డాడు.

అలా కనిపించడం లేదు..
ఈ సీజన్‌లో వరుసగా నాలుగో మ్యాచులో హైదరాబాద్ జట్టు ఓడిపోవడం తర్వాత ఈ వ్యాఖ్యలు చేశాడు అంబటి రాయుడు. "మిడిల్ ఓవర్లలో అవసరమైన సమయంలో వికెట్లు తీసే బౌలర్లు SRHకు లేరు. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు సాయి కిషోర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.. ప్రత్యర్థి జట్టును ఎలా అయితే ఒత్తిడిలోకి నెడతారో అలాంటి బౌలర్లు సన్ రైజర్స్‌లో లేరు. సన్‌రైజర్స్‌లో వికెట్లు తీయాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించలేదు. వాళ్లు డిఫెన్సివ్ గా ఆడుతున్నారు. బ్యాటర్లు బౌండరీలు బాదకుండా ఉండేలా మాత్రమే బౌలింగ్ చేస్తున్నారు. ఇలాంటి మిడిల్ ఓవర్స్ బౌలింగ్ తో IPL గెలవడం కష్టం. మిడిల్ ఓవర్లలో గేమ్ మార్చే బౌలర్లు అవసరం." అని రాయుడు పేర్కొన్నాడు.

Ambati rayudu says SRH loss reasons middle over bowling is poor in ipl 2025

ఆందోళన చెందొద్దు..
అభిషేక్ శర్మ ఫామ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాయుడు అభిప్రాయపడ్డాడు. "అతడి మైండ్‌సెట్‌లో మార్పు వస్తే చాలు. మిడ్ ఆఫ్ మిడ్ ఆన్ దిశగా చిన్న చిన్నగా బౌండరీలు కొడుతూ, సింగిల్స్ తీస్తే చాలు. ఆ తర్వాత ఫ్లోలో ఆటోమెటిక్ గా బిగ్ షాట్స్, పరుగులు వచ్చేస్తాయి. సన్ రైజర్స్ బేసిక్స్ పై కాస్త దృష్టి పెడితే చాలు. అంతా సెట్ అయిపోతుంది. టాప్ 3 అందరూ మంచిగానే ఉన్నారు. వాళ్లు లైన్ లోకి వచ్చేస్తారు. బిగ్ షాట్స్ ఆడితే చాలు. కాబట్టి హైదరాబాద్ జట్టు బౌలింగ్ పై ముందు దృష్టి పెట్టాలి." అని అన్నాడు.
Story first published: Monday, April 7, 2025, 15:10 [IST]
Other articles published on Apr 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+