స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక: పంత్, రాయుడికి బీసీసీఐ గుడ్ న్యూస్

హైదరాబాద్: వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేని టీమిండియా ఆటగాళ్లు అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వీరిద్దరితో పాటు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న నవదీప్ షైనీని వరల్డ్‌కప్ జట్టులో స్టాండ్‌బై ఆటగాళ్లుగా బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఎంపికైన 15 మందిలో ఎవరైనా గాయపడితే వీరు ఇంగ్లాండ్‌కు హుటాహుటిని పయనమవుతారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
"ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తరహాలోనే ముగ్గురు స్టాండ్‌బై ఆటగాళ్లు ఉన్నారు. రిషబ్ పంత్ మొదటి స్టాండ్ బై కాగా... అంబటి రాయుడు రెండో స్టాండ్ బైగా వ్యవహారిస్తాడు. ఇక, బౌలర్ల జాబితాలో నవదీప్ షైనీ స్టాండ్ బై. ప్రస్తుత జట్టులో ఎవరైనా గాయపడితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు అక్కడికి వెళ్తారు" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

వరల్డ్‌కప్ కోసం ప్రత్యేకంగా నెట్ బౌలర్లు
ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ కోసం ప్రత్యేకంగా ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, దీపక్ చాహర్‌లను నెట్ బౌలర్లుగా బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరి కేవలం నెట్ బౌలర్లుగానే వ్యవహారిస్తారని అధికారికంగా స్టాండ్‌బై ఆటగాళ్లు కారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

బౌలర్లు ఎవరైనా గాయపడితే
"ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, దీపక్ చాహర్ అధికారికంగా స్టాండ్‌బై ఆటగాళ్లు కారు. బౌలర్లు ఎవరైనా గాయపడితే వీరిలో ఎవరితోనైనా భర్తీ చేసే అవకాశం ఉంది. పూర్తిగా బ్యాట్స్‌మన్ అయితే అంబటి రాయుడు లేదా రిషబ్ పంత్‌కు అవకాశం దక్కుతుంది" అని ఆయన అన్నారు.

సోమవారం జట్టుని ప్రకటించిన బీసీసీఐ
ప్రస్తుతం క్రికెటర్లు విరామం లేకుండా ఐపీఎల్ ఆడుతుండటంతో వరల్డ్‌కప్‌కు ముందు యో-యో పరీక్ష ఉండదని ఆయన తెలిపారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

రాయుడు, పంత్‌లకు సెలక్టర్లు మొండిచేయి
విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జశ్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీలు ఉన్నారు. కాగా, అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు సెలక్టర్లు మొండిచేయి చూపించారు.

మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు
అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో పలువురు మాజీ క్రికెటర్లు సెలక్టర్లపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్‌కు సునీల్ గవాస్కర్ అండగా నిలవగా... అంబటి రాయుడికి గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. దీంతో వీరిద్దరిని బీసీసీఐ స్టాండ్‌బైగా ఎంపిక చేసింది
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications