వ్యక్తిగతంగా తీసుకోవద్దు.. హెచ్‌సీఏ బాస్‌కు రాయుడి విజ్ఞప్తి!!

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో అవినీతి పెరిగిందని తాను చేసిన ఆరోపణలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌ను క్రికెటర్ అంబటి రాయుడు కోరాడు. తనను సహనం కోల్పోయిన క్రికెటర్ అని అజార్ అనడంపై రాయుడు స్పందిస్తూ ఆదివారం మరో ట్వీట్ చేశాడు.
అసహన క్రికెటర్
'కేటీఆర్ సర్.. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతిపై దృష్టి పెట్టి నిర్మూలించాలని కోరుతున్నా' అని శనివారం రాయుడు ట్విటర్ వేదికగా తెలంగాణ ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. డబ్బుతో పాటు ఎన్నో ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న అవినీతి పరుల ప్రభావం పడ్డ జట్టుతో హైదరాబాద్ క్రికెట్ గొప్పగా ఎలా ఎదుగుతుందని ప్రశ్నించాడు. ఈ ట్వీట్‌పై అజహరుద్దీన్ స్పందిస్తూ... రాయుడు 'అసహన క్రికెటర్' అని అన్నాడు.
వ్యక్తిగతంగా తీసుకోవద్దు:
అజహరుద్దీన్ వ్యాఖ్యలపై ఆదివారం రాయుడు స్పందించాడు. 'హాయ్ అజహరుద్దీన్. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఇది మనిద్దరి కన్నా చాలా పెద్దది. హెచ్‌సీఏలో ఏం జరుగుతుందో మనిద్దరికీ తెలుసు. కుట్రలకు దూరంగా ఉంటూ నిపాక్షికంగా వ్యవహరిస్తారని నమ్ముతున్నా. హైదరాబాద్ క్రికెట్‌ను ప్రక్షాళన చేసే అవకాశం మీకుంది. భవిష్యత్ క్రికెటర్లను కాపాడతారని ఆశిస్తున్నా' అని ట్విటర్‌లో రాయుడు పేర్కొన్నాడు.

జట్టుతో అసౌకర్యంగా ఉన్నా
హెచ్‌సీఏలో రాజకీయాలపై అసంతృప్తిగా ఉన్న రాయుడు హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విరామం ఎంత కాలం అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. 'ఈ సీజన్‌లో హైదరాబాద్ తరపున రంజీ ట్రోఫీలో ఆడాలనుకున్నా. దురదృష్టవశాత్తూ అలా జరగట్లేదు. జట్టులో రాజకీయాల కారణంగా ఆటను ఆస్వాదించే పరిణామాలు కనిపించడం లేదు. ప్రస్తుత జట్టుతో అసౌకర్యంగా ఉన్నా' అని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications