Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఢిల్లీ కాదు.. ఐపీఎల్ 2025లో టాప్-4 జట్లు ఇవే: అంబటి రాయుడు

IPL 2025: ఐపీఎల్ 2025 పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ ఇప్పటికే సగం దశకు చేరుకుంది. ప్రస్తుతానికి మొత్తం 10 జట్లు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించడానికి రేసులో ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో 12 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. వారి తర్వాత ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ 10 పాయింట్లతో తర్వాతి స్థానాలలో ఉన్నాయి.

ఈ దశలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ ఐపీఎల్ సీజన్‌లో టాప్-4 జట్ల గురించి అంచనా వేశాడు. ఓ వీడియోలో మాట్లాడూతూ.. ఐపీఎల్ లో టాప్-4 జట్ల గురించి అంచనాలను రూపొందించాడు. ప్రపంచంలోని అత్యధిక ధనిక ఫ్రాంచైజీలో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ఈ సీజన్ లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తాయని అంబటి రాయుడు అంచనా వేశాడు.

Ambati Rayudu Predicts IPL 2025 Top-4 Teams Leaves Out Delhi Capitals

పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును అంబటి రాయుడు విడిచిపెట్టాడు. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లలో ఆరు గెలిచింది. మంగళవారం( ఏప్రిల్ 22) రోజున లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. లక్నో 160 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించగా.. మ్యాచ్ ను 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుచుకుంది.

అంబటి రాయుడు మాత్రమే కాకుండా మాజీ భారత టెస్ట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే, ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్, దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్ బౌచర్, భారత స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా, భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా తమ అగ్రశ్రేణి జట్లను ఎంచుకున్నాడు. కుంబ్లే ప్రకారం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్/రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు టాప్-4లో ఉండనున్నట్లు చెప్పాడు. ఆరోన్ ఫించ్ ప్రకారం.. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లేఆఫ్స్ చేరనున్నట్లు తెలిపాడు. బౌచర్ ప్రకారం.. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ కు చేరనున్నాయి. మహ్మద్ కైఫ్ ప్రకారం.. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మొదటి నాలుగు స్థానాల్లో నిలవనున్నాయి.

Story first published: Thursday, April 24, 2025, 18:54 [IST]
Other articles published on Apr 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+