For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025 CSK Playing 11: సీఎస్కే తుది జట్టు ఇదే - అంబటి రాయుడు

IPL 2025 CSK Playing 11: ఐపీఎల్ 2025 సమయం ఆసన్నమైంది. దీంతో ఈ మెగా లీగ్ కోసం అభిమానుల ఒంట్లో ఉత్సాహం పొంగి పొర్లుతోంది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా మ్యాచ్ టికెట్లు, ప్రిడక్షన్స్, ప్లేయర్ల రికార్డులు, ప్లేయింగ్ 11 అంచనాలు.. వగైరా అన్నీ తెలుసుకోవడం, కొనడంతో పాటు అభిప్రాయులు వ్యక్తం చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో సీఎస్కే తుది జట్టు ఎలా ఉండబోతుందో తన అభిప్రాయన్ని తెలిపాడు సీఎస్కే మాజీ ప్లేయర్ అంబటి రాయుడు. కాగా, సీఎస్కే తన తొలి మ్యాచ్ ను మార్చి 23న ముంబయి ఇండియన్స్ తో తలపడనుంది.

ఆ ఇద్దరు ఓపెనర్లుగా..
సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే ఓపెనింగ్ చేస్తారని చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో డబుల్ సెంచరీ బాదిన రచిన్ రవీంద్ర మూడో నెంబర్ లో వస్తాడని తెలిపాడు. స్టార్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కు బదులు ఆల్ రౌండ్ సామర్థ్యం ఉన్న సామ్ కరణ్ ను ఎంచుకున్నాడు. చివర్లో వచ్చే ధోనీ, నెం.7కు రావొచ్చని అభిప్రాయపడ్డాడు.

"కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేతో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. రచిన్ రవీంద్ర మూడో నెంబర్ లో వస్తాడు. నెం.4లో దీపక్ హోడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్.. ఈ ముగ్గురు భారత బ్యాటర్లలో ఒకరు దిగుతారు. నెం.5లో దూబె, నెం.6లో జడేజా, నెం.7లోధోనీ, నెం.8లో సామ్ కరణ్ వస్తారు. ఆ తర్వాత అశ్విన్, అన్షుల్ కాంభోజ్, మతీశా పతిరణ ఆడతారు" అని అంబటి రాయుడు తన అంచనాను చెప్పాడు.

రవిచంద్రన్ అశ్విన్ చేరికతో స్పిన్ విభాగం బలంగా ఉందని అన్నాడు అంబటి రాయుడు. అన్షుల్ కాంభోజ్, మతీశా పతిరణతో పేస్ అటాక్ చేస్తుందని చెప్పాడు. మ్యాచ్ పరిస్థితుల ఆధారంగా ఫ్రాంఛైజీ వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ ఇండియన్ (స్పిన్నర్ లేదా బ్యాటర్) ఇంపాక్ట్ ప్లేయర్ ను బరిలోకి దింపుతుందని చెప్పాడు.

అంబటి రాయడు సీఎస్కే తుది జట్టు ఇదే (అంచనా)
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా/రాహుల్ త్రిపాఠి/విజయ్ శంకర్, శివమ్ దూబే, MS ధోని , రవిచంద్రన్ అశ్విన్, సామ్ కరణ్, మతీషా పతిరణ, అన్షుల్ కాంభోజ్

Ambati Rayudu predicts CSK best playing XI for IPL 2025
Story first published: Saturday, March 15, 2025, 18:49 [IST]
Other articles published on Mar 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+