

హైదరాబాద్: ఆసియాకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా ఆదివారం భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అలవోక విజయం సాధించిన సంగతి తెలిసిందే. వికెట్ల పరంగా పాకిస్థాన్‌పై ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.
ఓపెనర్లు రోహిత్ శర్మ (111 నాటౌట్), శిఖర్ ధావన్ (114) సూపర్ సెంచరీలతో రాణించడంతో పాక్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రోహిత్ శర్న నేతృత్ంలోని టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 237 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పాక్ నిర్దేశించిన 237పరుగుల లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించగలిగింది. సూపర్-4లో భాగంగా పాకిస్థాన్ జట్టుపై భారత్ విజయం సాధించిన రోజే అంబటి రాయుడు బర్త్ డే కూడా.
దీంతో పాక్‌పై మ్యాచ్ గెలవడం, అంబటి రాయుడి పుట్టినరోజు సెలబ్రేషన్స్ రెండింటినీ కలిసి హోటల్ రూమ్‌లో జట్టు సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. రాయుడి పుట్టినరోజు వేడుకల్లో మాజీ కెప్టెన్ ధోని రెచ్చిపోయాడు. బర్త్ డే బాయ్ అంబటి రాయుడును కేక్‌తో ముంచెత్తాడు. దీంతో మిగతా టీమ్ సభ్యులు కూడా రాయుడును కేక్‌లో ముంచెత్తారు.
యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇది రెండో విజయం కావడం విశేషం. ఈ టోర్నీలో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా అజేయంగా దూసుకుపోతోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయం ద్వారా ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. పాక్‌తో ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఓపెనర్లు తొలి వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
ఫలితంగా ఛేజింగ్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస‍్వామ‍్యాన్ని సాధించిన భారత జోడిగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలోనే 2009లో హామిల్టన్‌లో న్యూజిలాండ్‌పై గంభీర్-సెహ్వాగ్ జోడి సాధించిన 209 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని అధిగమించారు. మరొకవైపు వన్డేల్లో తొలి వికెట్‌కు ఎక్కువసార్లు 100 కంటే ఎక్కువ పరుగులు సాధించిన రెండో భారత్ జోడిగా రోహిత్-ధావన్‌ల జోడి నిలిచింది.
ఇక్కడ సచిన్-గంగూలీ(21సార్లు) తొలి స్థానంలో ఉండగా, రోహిత్-ధావన్‌ల జోడి(13సార్లు) రెండో స్థానంలో నిలిచింది. భారత్ తన చివరి సూపర్-4 మ్యాచ్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో మంగళవారం తలపడనుంది. ఆడిన రెండు సూపర్ 4 మ్యాచుల్లో ఓడిన ఆఫ్ఘన్ జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకుంది.