ధోనీ రికార్డును సమం చేసిన అంబటి రాయుడు
హరారే/హైదరాబాద్: భారత బ్యాట్స్‌మన్ అంబటి రాయడు తన వన్డే కెరీర్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని శనివారం చేరుకున్నాడు. శనివారం జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రాయుడు ఈ ఘనత సాధించాడు.
భారత్ తరఫున 29 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు చేసిన రికార్డు గతంలో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరిట ఉంది. తాజాగా రాయుడు ఈ రికార్డును సమం చేశాడు.

మూడేళ్ల క్రితం ఇదే జింబాబ్వే జట్టుపై రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్‌లు 24 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా నవజ్యోత్ సిద్దూ 25 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు చేసినవారిలో ఉన్నారు.
జింబాబ్వే పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాగా, శనివారం జరిగిన మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ అరంగేట్రంతోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. దీంతో 9 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. రాయుడు 62 పరుగులు చేసి కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications