హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఆతిథ్య జట్లను హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (హెచ్‌సీఏ) గురువారం ప్రకటించింది. ఆగస్టు 22 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనబోయే రెండు హైదరాబాద్ జట్లను హెచ్‌సీఏ ప్రకటించింది.
హైదరాబాద్ ఎలెవన్ జట్టుకి అంబటి రాయుడు కెప్టెన్‌గా ఎంపిక కాగా, హైదరాబాద్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు అమోల్ షిండే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల హైదరాబాద్ ఫిట్‌నెస్ శిబిరానికి ఎంపికైన 16 ఏళ్ళ ఠాకూర్ తిలక్‌వర్మ జట్టులో చోటు సంపాదించాడు.
భారత అండర్-19 జట్టులో స్థానం సంపాదించిన భగత్‌వర్మను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. రెండు జట్లకు ఎంపికైన ఆటగాళ్ళు శుక్రవారం ఉదయం 8 గంటలకు ఉప్పల్ స్టేడియంలో రిపోర్ట్ చేయాలని హెచ్‌సీఏ కార్యదర్శి శేష్‌నారాయణ తెలిపాడు.

హైదరాబాద్ ప్రెసిడెంట్స్ ఎలెవన్: అమోల్ షిండే (కెప్టెన్), యతిన్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, రాహుల్, చందన్ సహాని, జావీద్ అలీ, రోహిత్‌రెడ్డి, నీరజ్ బిస్త్, ప్రణీత్‌రెడ్డి, కార్తీక్, తనయ్ త్యాగరాజన్, సుదీప్ త్యాగి, హితేష్‌యాదవ్, ఒమర్‌ఖాన్, రాధాకృష్ణ, వంశీవర్ధన్‌రెడ్డి