Successful run-chases: కోహ్లీ, ధోనిల రికార్డుని దాటేసిన రాయుడు

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఆఖరి వన్డే జట్టులో ఆడిన దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజాపై వేటు వేసిన విరాట్ కోహ్లీ వారి స్థానంలో అంబటి రాయుడు, కుల్దీప్ యాదవ్‌లను తీసుకున్న సంగతి తెలిసిందే. దినేశ్ కార్తీక్ స్థానంలో బరిలో దిగిన అంబటి రాయుడు ఈ మ్యాచ్‌లో 23 బంతులను ఎదుర్కొని 13 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.
తనకు అందివచ్చిన అవకాశాలను అంబటి రాయుడు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో విజయవంతంగా లక్ష్యాన్ని చేధించిన మ్యాచ్‌ల్లో ఎక్కువ సగటు ఉన్న బ్యాట్స్‌మెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలను అంబటి రాయుడు దాటేయడం విశేషం.

రాయుడు యావరేజి 103.33
టీమిండియా విజయవంతంగా ఛేజ్ మ్యాచ్‌ల్లో ధోనీ యావరేజి 103.07 ఉండగా.. అంబటి రాయుడు యావరేజి 103.33గా ఉంది. దశాంశాల తేడాతో రాయుడు ధోనీని దాటేశాడన్నమాట. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యావరేజి 96.94గా ఉంది. రస్సెల్ ఆర్నాల్ (91.00), మైకెల్ బేవాన్ (86.25) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మిడిలార్డర్‌లో సరైన బ్యాట్స్‌మన్ కోసం
జట్టులో మిడిలార్డర్‌లో సరైన బ్యాట్స్‌మన్ కోసం చూస్తోన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లను రొటేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మంచి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడు వరల్డ్ కప్ బెర్త్ కోసం దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌లతో పోటీ పడుతున్నాడు. కాగా, నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

న్యూజిలాండ్ నిర్దేశించిన 156 పరుగులు లక్ష్యాన్ని
న్యూజిలాండ్ నిర్దేశించిన 156 పరుగులు లక్ష్యాన్ని 34.5 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్ (75 నాటౌట్: 103 బంతుల్లో 6 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (45: 59 బంతుల్లో 3 ఫోర్లు), అంబటి రాయుడు (13 నాటౌట్)లు రాణించారు. ఈ సిరిస్‌లో రెండో వన్డే జనవరి 26న జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications