రాయుడు యోయోకి గైర్హాజరుకు కారణం.. ఫిట్‌నెస్ లోపమేనా?

హైదరాబాద్: భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడుపై మరోసారి సెలక్టర్లు వేటు వేశారు. గత నెలలో బెంగళూరు వేదికగా జరిగిన యో-యో ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిలై భారత జట్టులో చోటు కోల్పోయిన అంబటి రాయుడు.. తాజాగా ఆ టెస్టుకి గైర్హాజరైన కారణంగా భారత-ఎ జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. ఫిట్‌నెస్ ఇబ్బందులు కొనసాగుతూనే ఉండటంతో ఇలా చేసి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మంగళవారం ప్రకటించిన భారత్ 'ఎ', దులీప్ ట్రోఫీ జట్లలో రాయుడికి చోటు దక్కకపోవడానికి అతడు యోయో టెస్టుకు హాజరుకాకపోవడమే కారణమని స్పష్టమైంది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2018 ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రాయుడిని ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత జట్టులోకి గత మే నెలలో సెలక్టర్లు ఎంపిక చేశారు.
కానీ.. ఈ పర్యటన ముందు నిర్వహించిన యో-యో టెస్టులో ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో.. జట్టు నుంచి తప్పించి సురేశ్ రైనాకి అవకాశం కల్పించారు. ఆ సమయంలోనే ఆరు వారాల్లోపు మరోసారి ఫిట్‌నెస్ టెస్టుకి హాజరవ్వాలని బీసీసీఐ ఆదేశించింది. కానీ.. తాజాగా రాయుడు యో-యో టెస్టుకి గైర్హాజరవడంతో అతడ్ని భారత-ఎ జట్టుతో పాటు దిలీప్ ట్రోఫీ జట్లలోనూ స్థానంలో కల్పించలేదు.
గత ఏడాదితో పోలిస్తే యో-యో ఫిట్‌నెస్ టెస్టుని ఇటీవల బీసీసీఐ కఠినతరం చేసింది. భారత్ తరఫున ఆడాలంటే క్రికెటర్ కచ్చితంగా ఈ టెస్టుని పాసవ్వాలని ఆదేశించిన బీసీసీఐ.. కనీసం మార్కులు 16.1 రావాలని నిబంధనని విధించింది. యో-యో టెస్టుకి హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని అంబటి రాయుడు బీసీసీఐ కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications