Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నువ్వు రంగులు మార్చే ఊసరవెల్లిరా..': లైవ్ టీవీలో రాయుడు గొడవ!!

సీఎస్కే, ముంబయి ఇండియన్స్ మాజీ ప్లేయర్ అంబటి రాయుడు.. తరచుగా కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతో విమర్శలకు గురౌతుంటాడు. రీసెంట్‌గా లైవ్ టీవీలో మరో మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్‌తో గొడవ పడిన అంబటి రాయుడు.. అది జరిగి ఒక్క రోజు కూడా కాకుండానే మరో కామెంటేటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో వాగ్వివాదానికి దిగాడు! పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులో ఈ గొడవ చోటు చేసుకుంది.

నువ్వు రంగులు మార్చే ఊసరవెల్లి..
ఈ మ్యాచులో అంబటి రాయుడు - నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇద్దరూ కాసేపు మాటల యుద్ధానికి దిగారు! ఇద్దరు నవ్వుకుంటూనే ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకున్నారు. ఈ క్రమంలోనే ముందుగా రాయుడు మాట్లాడుతూ 'సిద్ధూ టీమ్స్ ను ఎప్పటికప్పుడు ఊసరవెల్లిలాగా మార్చుతూ ఉంటాడు' అని కామెంట్ చేశాడు. దీనికి నవజ్యోత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. 'ఈ ప్రపంచంలో ఊసరవెల్లికి ప్రతిరూపంగా ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే' అంటూ తిరిగి కౌంటర్ ఇచ్చాడు. ఇది కాస్త చర్చకు దారీ తీసింది. అయితే ఇదంతా నవ్వుతూనే సాగినా.. కౌంటర్లు మాత్రం వేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ambati Rayudu and Navjot Singh Sidhu clash on Live TV in PBKS VS CSK match in IPL 2025

రోహిత్ అవసరం లేదులే..
ఇకపోతే అంబటి రాయుడు.. తన క్రికెట్ విశ్లేషణలతో ఎప్పుడూ చర్చనీయాంశం అవుతుండాడు. ఎవరో ఒకరిని విమర్శిస్తూ.. అభిమానుల ఆగ్రహానికి గురౌతుంటాడు. ఆ మధ్య ఆర్సీబీని కూడా ఎగతాళి చేశాడు. ఆ తర్వాత మాటలను వెనక్కి తీసుకున్నాడు. ఇక రీసెంట్‌గా జరిగిన చర్చలోనూ.. ముంబయి కెప్టెన్
హార్దిక్‌కు రోహిత్ వ్యూహాత్మక పార్ట్నర్‌గా ఉండాలని సంజయ్ బంగార్‌ అంటే.. దానిని అంబటి రాయుడు తిరస్కరించాడు. హార్దిక్‌కు ఎవరి సాయం అవసరం లేదని తిరిగి కౌంటర్ వేశాడు.

Story first published: Wednesday, April 9, 2025, 11:43 [IST]
Other articles published on Apr 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+