Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పరిపక్వత లేని క్రికెటర్ 'నోబాల్‌' కి విచిత్రంగా ఔటయ్యాడు

క్రికెట్‌లో నో బాల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. బౌలర్ వేసిన బంతిని అంఫైర్ నోబాల్‌గా ప్రకటించినప్పుడు కేవలం రనౌట్ రూపంలోనే బ్యాట్స్‌మెన్ ఔట్ అవుతాడు. కానీ పరిపక్వత లేని ఓ ఇంగ్లాండ్ క్రికెట్ విచిత్రంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. కౌంటీ క్రికెట్‌లో లైమింగ్టన్, హ్యాంపైర్ జట్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్‌లో 35 ఏళ్ల బ్రయాన్ డార్బీషైర్..... లైమింగ్టన్ జట్టు తరుపున మ్యాచ్ ఆడుతున్నాడు. బౌలర్ వేసిన నోబాల్‌కు బ్రయాన్ డార్బీషైర్ పెవిలియన్‌కు చేరుకున్న ఘటన ఆసక్తికరంగా మారింది. అసలు నోబాల్‌కు ఎలా పెవిలియన్‌కు చేరుకున్నాడో చూద్దాం.

Amatuer England cricketer dismissed in weird manner

బౌలర్ వేసిన బంతిని బ్రయాన్ డార్బీషైర్ ఢిపెన్స్ ఆడాడు. ఆ బంతిని మైదాన అంఫైర్లు నోబాల్‌గా ప్రకటించారు. ఇంతలో బ్రయాన్ డార్బీషైర్ తనకు సమీపంలో పడ్డ బంతిని తీసి ఫీల్డర్ వైపు విసిరాడు. ఆ తర్వాత జరిగిన ఘటనకు బ్రయాన్ డార్బీషైర్ ఆశ్చర్యపోయాడు.

ఫీల్డర్ బ్రయాన్ డార్బీషైర్ ఔట్ అయినట్లు అప్పీలు చేయడం, అంపైర్ ఔట్‌గా ప్రకటించడం చకచక జరిగిపోయాయి. స్ధానిక మెర్లీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధన 33 ప్రకారం ఫీల్డర్ అనుమతి లేకుండా బ్యాట్స్‌మెన్ బంతిని తాకకూడదు.

మెర్లీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) లా అడ్వైజర్ మార్క్ విలియమ్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రికెట్లో నోబాల్‌కు రనౌట్ కాకుండా, ఈ తరహాలో ఓ క్రికెటర్ ఔట్ అయి పెవిలియన్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం అన్నారు. ఫీల్డర్ చేసిన అప్పీల్ సరైదేనంటూ సమర్ధించారు.

బ్యాట్స్‌మెన్ బ్రయాన్ డార్బీషైర్ ఔట్ అవడంతో 58 పరుగులు తేడాతో లైమింగ్టన్ జట్టు ఓటమిని చవిచూసింది. మ్యాచ్ అనంతరం బ్రయాన్ డార్బీషైర్ మాట్లాడుతూ అంఫైర్ల విధానాన్ని తాను తప్పబట్టడం లేదని, ప్రత్యర్ధి జట్టుకు అసలు గేమ్ స్పిరిట్ లేదన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+