Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గుండెపోటుతో బామ్మ మృతి: స్టార్ క్రికెటర్ క్లారిటీ!

Amanjot Kaur: మహిళా క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత భారత ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ తన బామ్మ(నాయనమ్మ) మరణం గురించి వస్తున్న పుకార్లపై స్పందించారు. గుండెపోటు కారణంగా ఆమె బామ్మ మరణించారని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తన బామ్మ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అమన్‌జోత్ కౌర్ ఈ వదంతులు అవాస్తవమని తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ప్రకటనను పంచుకున్నారు.

అమన్‌జోత్ కౌర్ ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (101 పరుగులు) కీలక క్యాచ్‌ను అందుకొని మ్యాచ్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్యాచ్‌ను 'మ్యాచ్ విన్నింగ్ క్యాచ్'గా క్రికెట్ పండితులు అభివర్ణించారు. భారత జట్టు విజయం తర్వాత అమన్‌జోత్ తండ్రి భూపిందర్ సింగ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో అమన్‌జోత్ బామ్మ భగవంతికి గుండెపోటు వచ్చిందని.. అయితే ఆమె ప్రపంచ కప్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఆమెకు చెప్పలేదని తెలిపారు. భూపిందర్ సింగ్ మాట్లాడుతూ.. మొహాలీలోని తమ ఇంటి దగ్గర వీధిలో, పార్కులో అమన్‌జోత్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి తన తల్లి భగవంతియే ఆమెకు అండగా ఉన్నారని, తాను షాపులో ఉన్నప్పుడు బయట కూర్చొని ఆమె ఆడటం చూసేవారని చెప్పారు. ఈ వ్యాఖ్యల కారణంగా.. అమన్‌జోత్ బామ్మ మరణించారనే తప్పుడు వార్తలు ఆన్‌లైన్‌లో వ్యాపించాయి.

Amanjot Kaur Denies Rumors of Grandmother Death Due to Heart Attack

దీనిపై స్పందించిన అమన్‌జోత్ కౌర్.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాశారు. "నా బామ్మ క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అని తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి ఆన్‌లైన్‌లో వ్యాపిస్తున్న ఏ తప్పుడు సమాచారాన్ని నమ్మకండి లేదా ప్రచారం చేయకండి. నన్ను పరామర్శించిన, నాపై ప్రేమ చూపిన అందరికీ ధన్యవాదాలు. నా 90ల నాటి చిన్నారి (బామ్మ) పూర్తిగా ఆరోగ్యంగా ఉంది." అని పేర్కొన్నారు.

Story first published: Wednesday, November 5, 2025, 10:03 [IST]
Other articles published on Nov 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+