కెప్టెన్ షై హోప్‌తో గొడవ పడి మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడిన బౌలర్ అల్జారీ జోసెఫ్‌పై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. రెండు మ్యాచ్‌లు నిషేధం విధిస్తూ వేటు వేసింది. ఆటగాళ్ల నుంచి ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని పేర్కొంది. బార్బడోస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో షై హోప్‌తో అల్జారీ జోసెఫ్ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. తొలి బంతి తర్వాత కెప్టెన్ షై హోప్ ఫీల్డింగ్ సెటప్‌పై అల్జారీ జోషెఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ ఓవర్‌ను కొనసాగించిన నాలుగో బంతికి జోర్డాన్ కాక్స్ (1)ను రాకాసి బౌన్సర్‌తో ఔట్ చేశాడు. కాగా, వికెట్ కీపర్- సారథి షై హోప్‌తో వికెట్ సంబరాలు చేసుకోవడానికి అల్జారీ నిరాకరించాడు. ఔటైన అనంతరం కూడా కెప్టెన్‌తో తీవ్రస్థాయిలోనే మాటలు సంధించాడు.

ఆ తర్వాత మరో రెండు బంతులేసి ఓవర్ పూర్తి చేశాడు. ఆ వెంటనే కెప్టెన్‌పై అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. కాసేపు డ్రెస్సింగ్ రూమ్‌లోనే కూర్చున్నాడు. వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ వచ్చి అల్జారీ జోసెఫ్‌తో మాట్లాడి అతనికి సర్థి చెప్పాడు. దాంతో అల్జారీ జోసెఫ్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. 10 ఓవర్ల కోటాను పూర్తి చేసి రెండు వికెట్లు తీశాడు.
అయితే అల్జారీ జోసెఫ్ వైఖరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్‌లోని వ్యాఖ్యతలు కూడా అతని వైఖరిని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ బోర్డు అల్జారీ జోసెఫ్‌పై కఠిన చర్యలు తీసుకుంది. రెండు మ్యాచ్‌లకు నిషేధం వధించింది. కోచ్ డారెన్ సామీ కూడా జోసెఫ్‌పై ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఘటనపై అల్జారీ జోషెఫ్ స్పందిస్తూ.. కెప్టెన్ షై హోప్‌కు, సహచరులకు, టీమ్ మేనేజ్మెంట్‌కు క్షమాపణలు చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(108 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 74), డాన్ మౌస్లీ(70 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 57) హాఫ్ సెంచరీలతో రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే(3/35) మూడు వికెట్లు తీయగా.. రోమారియో షెఫర్డ్(2/33), అల్జారీ జోసెఫ్(2/45) రెండేసి వికెట్లు పడగొట్టారు. రోస్టన్ చేజ్(1/42) ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 43 ఓవర్లలోనే 2 వికెట్లకు 267 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. బ్రాండన్ కింగ్(117 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 102), కీసీ కార్టీ(114 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 128 నాటౌట్) సెంచరీలతో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టోప్లీ, జామీ ఓవర్టన్ తలో వికెట్ తీసారు. స్టన్నింగ్ క్యాచ్‌తో పాటు సెంచరీతో చెలరేగిన బ్రాండన్ కింగ్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Alzarri Joseph was a very angry man yesterday.
— Anirudh Kalra (@CricketKalra) November 7, 2024
Here is a Rip-Snorter. pic.twitter.com/vzKEhP51OI