Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒరెయ్ ఆర్‌సీబీ..ప్లాన్‌తోనే అతడిని కొన్నావా? మధ్యలో దండం ఎందుకు పెట్టావ్?

ఐపీఎల్ 2024 వేలం ఉత్కంఠగా సాగుతోంది. ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. రూ 24.75 కోట్లకు అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. మరో ఆసీస్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ కూడా భారీ ధర పలికాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల వెచ్చించి కొనుగోలు చేసింది.

రోవ్‌మన్ పావెల్‌ను రూ.7.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. హ్యారీ బ్రూక్‌ను రూ.4 కోట్లకు ఢిల్లీ, ట్రావిస్ హెడ్‌ను రూ.6.80 కోట్లకు, హసరంగను రూ.1.50 కోట్లకు సన్‌రైజర్స్ దక్కించుకుంది. రూ.1.8 కోట్లకు రచిన్ రవీంద్ర, రూ.4 కోట్లకు శార్దూల్ ఠాకూర్, రూ.14 కోట్లకు డారిల్ మిచెల్‌ను చెన్నై కొనుగోలు చేసింది. ఉమేశ్ యాదవ్ రూ.5.8 కోట్లకు గుజరాత్, గెరాల్డ్ కొయెట్జీని రూ.5 కోట్లకు, మధుశంకను రూ.4.6 కోట్లకు ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది.

Alzarri joseph- rcb once again disappointed with their decisions in the Ipl auction 2024

హర్షల్ పటేల్ రూ.11.75 కోట్లకు, క్రిస్ వోక్స్‌ను రూ.4.2 కోట్లకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది. రూ.6.4 కోట్లకు శివమ్ మావీ లక్నో దక్కించుకోగా, అల్జారీ జోసెఫ్‌ను రూ.11.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకుంది.

అయితే వెస్టిండీస్ పేసర్ జోసెఫ్ కోసం భారీ ధర వెచ్చింనందకు ఆర్సీబీ నెట్టింట్లో విమర్శలు ఎదుర్కొంటుంది. ఆర్సీబీ జట్టు మొదటి నుంచి బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది.కప్‌ను అందుకోకపోవడానికి బౌలింగ్‌యే కారణమని విమర్శలు ఉన్నాయి. ఆర్సీబీ మేనేజ్మెంట్ మరోసారి నాణ్యమైన బౌలర్లను వేలంలో దక్కించుకోలేదని ట్రోల్స్‌కు గురవుతోంది. ప్లాన్‌తోనే వేలానికి అసలు వచ్చారా అని ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఆర్సీబీ కమిన్స్, శివమ్ మావీ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దక్కించుకోలేకపోయింది. మరోవైపు హేజిల్‌వుడ్ పేరు వేలంలో ప్రకటించినప్పుడు ఆర్సీబీ ఫ్రాంచైజీ దండం పెడుతూ మాకొద్దు అని సింబాలిక్‌గా చెప్పడం నెట్టింట్లో వైరల్‌గా మారింది. హేజిల్‌వుడ్‌ను అలా అవమానించడం సరికాదని నెటిజన్లు అంటున్నారు.

Story first published: Tuesday, December 19, 2023, 17:40 [IST]
Other articles published on Dec 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+