కొందరికి నాపై అనుమానం, అసహ్యం: బీసీసీఐ వేడుకలో కోహ్లీ
హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎప్పుడూ ఉండాలనుకుంటున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దీని కోసం ఏమి చేయాలో తెలుసని, మూడు ఫార్మెట్లలో గొప్ప ప్రదర్శన కనబరిస్తేనే అది సాధ్యమని కోహ్లీ వెల్లడించాడు.
బుధవారం బెంగళూరులోని రిట్జ్ హోటల్‌లో బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం జరిగింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాలీ ఉమ్రిగర్ అవార్డును అందుకున్నారు. పాలీ ఉమ్రిగర్ అవార్డును మూడుసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. అవార్డును అందుకున్న తర్వాత కోహ్లీ మాట్లాడాడు.

కెప్టెన్సీని జాబ్ మాదిరి కాకుండా ఓ బాధ్యతగా భావిస్తున్నా
ఈ మధ్య కాలంలో నిలకడగా ప్రదర్శన చేయడానికి తనపై తనకున్న నమ్మకమే కారణమని కోహ్లీ స్పష్టం చేశాడు. 'ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఉంటాలని కోరుకుంటా. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తేనే అది సాధ్యం. అలాంటి ప్రదర్శన కనబరిచేందుకు కృషి చేస్తా. అప్పుడే అత్యుత్తమ క్రికెటర్‌గా ఉంటాం. నాకు వరల్డ్ అత్యుత్తమ ఆటగాడిగా ఉండటం ఇష్టం. ఎప్పుడూ టాప్ ఆటగాళ్ల జాబితాలో ఉండాలని అనుకుంటా. కెప్టెన్సీని జాబ్ మాదిరి కాకుండా ఓ బాధ్యతగా భావిస్తున్నా. సరైన నిర్ణయాలు తీసుకుని జట్టుని సరైన మార్గంలో నడిపించడంతో పాటు జట్టులో భరోసా కల్పించాలి' అని కోహ్లీ తెలిపాడు.

ప్రతి ఒక్క ఆటగాడికీ తన కెరీర్‌లో మరిచిపోలేని రోజులు ఉంటాయి
'గత 10-12 నెలలుగా అద్ఫుత ప్రదర్శన చేస్తున్నాను. ప్రతి ఒక్క ఆటగాడికీ తన కెరీర్‌లో మరిచిపోలేని రోజులు ఉంటాయి. కొన్నిసార్లు గొప్పగా ఆడలేపోయినా.. అత్యుత్తమ ఆటగాళ్ల ప్రదర్శనతో విజయాలు అందుకోగలం. అందుకే మా జట్టు విజయాలు సాధించగలుగుతోంది. క్రికెటర్లకు ఓ ఇయర్ అనేది అద్భుతంగా ఉంటుంది. 2015 చివరి నుంచి చూస్తే 2016 మొత్తం కూడా చాలా అద్భుతంగా గడిచింది. నా కెరీర్‌లోనే అద్భుత ప్రదర్శన చేశాను. అందు కోసం విపరీతంగా శ్రమిస్తా' అని కోహ్లీ అన్నాడు.

ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు
నేను 120 శాతం ప్రదర్శన చేయడానికి సిద్ధమైతే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. నా ఆటపై చాలా మందికి అనుమానాలు ఉండవచ్చు. కొందరు నా ఆటను అసహ్యించుకోవచ్చు. నన్ను ద్వేషించే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాపై నమ్మకం ఉంచుకుని మాత్రమే ముందుకు సాగుతా. జట్టు గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తా' అని కోహ్లీ అన్నాడు.

జట్టులోని సహచరుల సహకారంతోనే అద్భుతాలు సృష్టించాం
తన విజయాల పరంపరలో జట్టు సమిష్టి కృషి ఎంతో ఉందని కోహ్లీ చెప్పాడు. 'నా జట్టు సహచరుల సాయం లేకుండా ఈ విజయాలను సాధించలేను. జట్టులోని సహచరుల సహకారంతోనే టెస్టు క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించాం. ఒకానొక సమయంలో నేను చెత్త ప్రదర్శన చేసినప్పుడు, జట్టులోకి కొందరు ఆటగాళ్లు ఛాంపియన్స్ మాదిరి రాణించే జట్టును విజయాలను అందించారు. అందుకే మాది ఛాంపియన్ జట్టు అని, ప్రపంచంలో నెంబర్ వన్ ర్యాంకులో ఉన్నాం' అని కోహ్లీ గొప్పగా చెప్పాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా వరుసగా 19 టెస్టు విజయాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications