న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావ్‌: గిల్‌‌క్రిస్ట్‌‌కు హర్భజన్ చురకలు

Harbhajan Singh slams Adam Gilchrist Over DRS Excuse || Oneindia Telugu
Always crying: Harbhajan Singh slams Adam Gilchrist over DRS excuse

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ భారత్‌ తరఫున తొలి హ్యాట్రిక్‌ తీసిన సంగతి తెలిసిందే. తాజాగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ ఘనత సాధించడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది.

ఆ ప్రదర్శనకు ప్రాముఖ్యత లేదా?: సెలక్టర్లపై మండిపడ్డ షెల్డన్ జాక్సన్ఆ ప్రదర్శనకు ప్రాముఖ్యత లేదా?: సెలక్టర్లపై మండిపడ్డ షెల్డన్ జాక్సన్

వరుస బంతుల్లో పెవిలియన్‌కు

ఆ మ్యాచ్‌లో 72వ ఓవర్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ రికీ పాంటింగ్‌, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌, షేన్‌వార్న్‌లను భజ్జీ వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. రెండో వికెట్‌గా గిల్‌క్రిస్ట్‌ను భజ్జీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ వీడియోను తాజాగా ఓ అభిమాని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఆ వీడియలో ప్యాడ్‌ కంటే ముందుగానే బంతి బ్యాట్‌కు తగిలినట్టు కనిపించడాన్ని గిల్‌క్రిస్ట్‌ గుర్తు చేస్తూ... అప్పట్లో డీఆర్‌ఎస్‌ ఉంటే తాను ఔటయ్యేవాడిని కాదంటూ ఏడుస్తున్నట్టు ఉన్న ఎమోజీని ట్వీట్‌ చేశాడు.

హర్భజన్ కాస్తంత ఘాటుగానే

హర్భజన్ కాస్తంత ఘాటుగానే

గిల్‌క్రిస్ట్ ట్వీట్‌పై హర్భజన్ కాస్తంత ఘాటుగానే స్పందించాడు. భజ్జీ తన ట్విట్టర్‌లో "మొదటి బంతికి ఔటవ్వకపోతే నువ్వు ఎక్కువసేపు ఆడేవాడివని అనుకుంటున్నావా? ఇలాంటి ఘటనలపై ఏడవటం ఆపు మిత్రమా! నువ్వు ఆడే రోజుల గురించి మాట్లాడటం నీకు సరైందనే అనిపిస్తుంది. కొన్ని విషయాలను మార్చలేమనడానికి నువ్వు ఓ ఉదాహరణ. ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావ్‌" అని ట్వీట్ చేశాడు.

భారత్ నుంచి ముగ్గురు మాత్రమే

భారత్ నుంచి ముగ్గురు మాత్రమే

అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే భజ్జీ ఆ ట్వీట్‌ను తన అకౌంట్‌ నుంచి తొలిగించాడు. ఆ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సహా 7/123తో భజ్జీ విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్‌ 171 పరుగులతో విజయం సాధించింది. కాగా, టెస్టు క్రికెట్ చరిత్రలో హర్భజన్‌ తర్వాత 2006లో పాక్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌.. తాజాగా వెస్టిండి‌స్‌పై జస్ప్రీత్ బుమ్రా హ్యాట్రిక్‌ నమోదు చేశారు.

Story first published: Thursday, September 5, 2019, 10:39 [IST]
Other articles published on Sep 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X