Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : మినీ వేలంలో 991 మంది ఆటగాళ్లు.. రెండు కోట్ల క్లబ్బులో అంతా విదేశీయులే..?

Almost thousand players register names for IPL mini auction

ఈ నెల చివర్లో ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. కోచి వేదికగా జరిగే ఈ వేలంలో 991 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారట. వీరి కోసం ఐపీఎల్‌లోని మొత్తం పది ఫ్రాంచైజీలు పోటా పోటీగా డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. అయితే ఈ 991 మందిలో కేవలం 20 మంది మాత్రమే తమ కనీస ధర రూ.2 కోట్లుగా నిర్ణయించుకున్నారట.

ఐపీఎల్ వేలం అంటేనే ఫ్రాంచైజీలతోపాటు అభిమానులకు కూడా బాగా ఆసక్తి. ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేస్తుందని ఆసక్తిగా చూస్తుంటారు. ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోంది. బెన్ స్టోక్స్, శామ్ కర్రాన్, కామెరూన్ గ్రీన్, కేన్ విలియమ్సన్ తదితర స్టార్ ఆటగాళ్లు కూడా ఈసారి మినీ వేలంలో ఉన్నారు. దీంతో ఫ్రాంచైజీల ఆసక్తి మరీ ఎక్కువైంది.

ఆస్ట్రేలియా నుంచే ఎక్కువ మంది..

ఆస్ట్రేలియా నుంచే ఎక్కువ మంది..

కోచి వేదికగా జరిగే ఐపీఎల్‌ మినీ వేలంలో మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 714 మంది భారతీయులే ఉండటం గమనార్హం. వీరిలో 19 మంది భారత జట్టుకు ఆడిన వాళ్లు కాగా.. మిగతా వాళ్లంతా దేశవాళీ ప్లేయర్లే. భారత్ తర్వాత అత్యధికంగా ఈ వేలంలో పాల్గొంటున్న ఆటగాళ్లు ఆస్ట్రేలియా వాళ్లు. ఆసీస్ నుంచి ఈసారి 57 మంది వేలంలో ఉన్నారు. ఆస్ట్రేలియా తర్వాత సౌతాఫ్రికా (52 మంది), వెస్టిండీస్ (33 మంది) నుంచి అత్యధిక ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు.

కనీస ధర రూ.2 కోట్లు

కనీస ధర రూ.2 కోట్లు

మినీ వేలంలో కనీస తమ కనీస ధను రూ.2 కోట్లకు పెట్టుకునే అవకాశాన్ని ఆటగాళ్లకు కల్పించింది ఐపీఎల్ యాజమాన్యం. అయితే భారత ఆటగాళ్లు ఎవరూ ఈ రేట్‌ను తీసుకోలేదు. ఈ మినీ వేలంలో మొత్తం 21 మంది తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకోగా.. వీళ్లంతా విదేశీ ప్లేయర్లే కావడం గమనార్హం. భారత వెటరన్ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే తదితరులు తమ కనీస ధరను రూ.1 కోటిగా నమోదు చేసుకున్నారు. అజింక్య రహానే, జయదేవ్ ఉనద్కత్ ఇద్దరూ కూడా రూ.50 లక్షల కేటగిరీలో పేర్లు నమోదు చేసుకున్నారు.

రెండుకోట్ల బ్యాచ్

రెండుకోట్ల బ్యాచ్

మినీ వేలంలో తమ కనీస ధరను రూ.2 కోట్లుగా 21 మంది నిర్ణయించారు. వీరిలో ఒక్క భారతీయుడు లేడు. మరి ఆ విదేశీ ఆటగాళ్ల జాబితాలో జేమీ ఓవర్టన్, క్రెగ్ ఓవర్టాన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రైలీ రూసో, రాసీ వాన్‌ డర్ డస్సెన్, ఏంజెలో మాథ్యూస్, నాథన్ కౌల్టర్ నైల్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, శామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్ ఉన్నారు.

Story first published: Friday, December 2, 2022, 10:56 [IST]
Other articles published on Dec 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+