'ఐపీఎల్ జేబులు నింప‌డానికి త‌ప్ప ఎందుకూ ప‌నికిరాదు.. ఆ టోర్నీకి ఎవ‌రూ ప్లేయ‌ర్స్‌ని పంపించొద్దు'

IPL vs T20 World Cup : Boards Should Stop Players Going To The IPL : Allan Border

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్ అలన్ బోర్డర్ ఫ్రాంచైజ్ క్రికెట్‌పై మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. టీ20 లీగ్ జేబులు నింప‌డానికి త‌ప్ప ఎందుకూ ప‌నికి రాద‌ని అత‌ని అభిప్రాయం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కంటే టీ20 ప్రపంచ‌క‌ప్‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని బోర్డ‌ర్ స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచక‌ప్‌ను కాద‌ని ఐపీఎల్‌ 2020ని నిర్వ‌హించ‌డంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సీరియ‌స్ అయ్యాడు. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచక‌ప్‌ను 2022కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ విండోలో యూఏఈ వేదికగా బీసీసీఐ ఐపీఎల్ 200ని నిర్వహించింది.

మామధ్య ఎలాంటి గొడ‌వ‌లు లేవు.. మంచి ఇన్నింగ్స్‌ ఆడావని కోహ్లీ మెచ్చుకున్నాడు: సూర్యకుమార్

ఐపీఎల్‌కు ఎవ‌రూ ప్లేయ‌ర్స్‌ని పంపించొద్దు:

ఐపీఎల్‌కు ఎవ‌రూ ప్లేయ‌ర్స్‌ని పంపించొద్దు:

తాజాగా అలన్ బోర్డర్ ఏబీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'నేను సంతోషంగా లేను. స్థానిక పోటీల కంటే ప్రపంచ ఆటకు ప్రాధాన్యత ఉండాలి. ఇంకా చెప్పాలంటే.. ఐపీఎల్ కంటే టీ20 ప్రపంచ‌క‌ప్‌కు ప్రాధాన్య‌త ఇవ్వాలి. టీ20 ప్రపంచ‌క‌ప్ జ‌ర‌గ‌దు అన్న‌ప్పుడు.. ఐపీఎల్ ఎలా జ‌రుగుతుంది. ఐపీఎల్ నిర్వ‌హించాల‌న్న నిర్ణ‌యాన్ని నేను ప్ర‌శ్నిస్తున్నా. అది కేవ‌లం డ‌బ్బుల కోసం ఆడే టోర్నీ. క‌చ్చితంగా టీ20 ప్రపంచ‌క‌ప్‌కే ప్రాధాన్య‌త ఇవ్వాలి. కాద‌ని ఐపీఎల్ నిర్వ‌హిస్తే.. అన్ని బోర్డులు త‌మ ప్లేయ‌ర్స్‌ను లీగ్‌కు వెళ్ల‌కుండా అడ్డుకోవాలి' అని సూచించాడు.

టెస్ట్ క్రికెట్‌ను బ‌తికించ‌గ‌ల‌డు:

టెస్ట్ క్రికెట్‌ను బ‌తికించ‌గ‌ల‌డు:

భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌పై స్పందిస్తూ.. విరాట్ కోహ్లీపై ప్ర‌శంస‌లు కురిపించాడు. అత‌డు టెస్ట్ క్రికెట్‌ను బ‌తికించ‌గ‌ల‌డ‌ని అలన్ బోర్డర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. 'విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌ను బ‌తికించ‌గ‌లడు. టెస్ట్ క్రికెట్ అతడు బాగా ఆడుతాడు. కోహ్లీతో పాటు భారత్, ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్లు టెస్ట్ క్రికెట్‌ను కాపాడగలవు' అని బోర్డర్ పేర్కొన్నాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆస్ట్రేలియాలో ప్రసవిస్తుందని, దీంతో కోహ్లీ సంతానాన్ని తమ దేశానికి చెందినవారిగా పరిగణించవచ్చని ఆశించామని బోర్డర్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. డిసెంబరు 17 నుంచి 21 వరకూ అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత్‌కి కోహ్లీ వచ్చేయనున్నాడు.

ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ గెలుస్తుంది:

ఆస్ట్రేలియా 2-1తో సిరీస్ గెలుస్తుంది:

'విరాట్‌ కోహ్లీ తొలి టెస్టులో మాత్రమే ఆడటం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. ఇది భారత్‌కు తీరని లోటు. బ్యాట్స్‌మన్, నాయకుడిగా అతడి స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు. కోహ్లీ మనసు పెట్టి ఆడతాడు. దూకుడుతో పాటు అంకిత భావంతో అతడు ఆడే విధానం నాకు ఎంతో ఇష్టం. అతడిని భారత జట్టు ఎంతో మిస్‌ అవుతుంది. కోహ్లీ ఓ స్పెషల్ ప్లేయర్, అతడికి ఎంతో ప్రతిభ ఉంది. సానుకూల ధోరణితో ఆడుతూ జట్టును గొప్పగా నడిపిస్తాడు. టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో గెలుస్తుందని భావిస్తున్నా' అని అలెన్ బోర్డర్‌ జోస్యం చెప్పాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, November 21, 2020, 14:47 [IST]
Other articles published on Nov 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X