
కెప్టెన్‌గా పృధ్వీ షా
ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ముంబైకి చెందిన పృధ్వీ షా హారిస్ షీల్డ్ టోర్నీ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 546 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ముంబై రంజీ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుత అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ఆడుతున్న భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. అతి తక్కువ సమయంలోనే ఐదు సెంచరీలను ఖాతాలో వేసుకున్నాడు.

ఓపెనర్ శుభ్‌మన్ గిల్
అండర్-19 వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. హర్యానాకు చెందిన శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్ కూడా. అండర్-19 జట్టుతో పాటు అండర్-23, భారత్-ఎకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో సెంచరీల మీద సెంచరీలు చేశాడు. దేశవాళీ పోటీల్లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ బెంగాల్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ 93 యావరేజితో 278 పరుగులు చేశాడు.

యువ పేసర్
ప్రస్తుతం యువ జట్టులో పేస్ విభాగంలో ప్రధాన బౌలర్ కమలేష్ నాగర్‌కోటి. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ భారత్‌కు శుభారంభాలను ఇస్తున్నాడు. రాజస్థాన్‌కు చెందిన కమలేష్ న్యూజిలాండ పిచ్‌లపై సత్తా చాటతాడని అందరూ భావిస్తున్నారు. గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్‌పై హ్యాట్రిక్ తీయడంతో కమలేష్ వెలుగులోకి వచ్చాడు. అండర్-23, ఆసియాకప్‌లో మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీశాడు.

నోయిడా కుర్రాడు శివం మావి
దేశవాళీ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు శివం మావి. ఇటీవల ఛాలెంజర్ ట్రోఫీలో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌కు వణుకు పుట్టించాడు. మెరుపు వేగం ఇతని సొంతం. ఛాలెంజర్ ట్రోఫీలో భారత్ బ్లూకు ఆడాడు. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా నిలిచాడు.

అపార అనుభవం హిమాంశు రాణా సొంతం
ప్రస్తుతం అండర్-19 వరల్డ్ కప్ జట్టులో అత్యంత అనుభవం కలిగిన ఆటగాడు హిమాంశు రాణా. 2016లోనే దేశవాళీలో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు హర్యానా తరఫున 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది ఇంగ్లాండ్‌పై అతను నాలుగు మ్యాచ్‌ల్లో 211 పరుగులు చేసి సత్తా చాటాడు. దీనిలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.


Click it and Unblock the Notifications












