For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

U-19 వరల్డ్ కప్‌తో వెలుగులోకి: ఎవరీ శుభమాన్ గిల్

By Nageshwara Rao

హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి భారత్ ఫైనల్స్‌కు చేరింది. భారత్ ఫైనల్స్‌కు చేరడంలో యువ ఆటగాఢు శుభమాన్ గిల్ కీలకపాత్ర పోషించాడు. క్రైస్ట్ చర్చ్‌ హాగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో పాకిస్థాన్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని శుభమాన్ గిల్ సెంచరీని నమోదు చేశాడు.

 భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా

భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా

ఈ క్రమంలో 94 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఈ వరల్డ్ కప్‌లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభమాన్ గిల్ (341) నిలిచాడు. కుడిచేతివాటం బ్యాట్స్‌మన్ అయిన శుభమాన్ గిల్ అండర్-19 వరల్డ్ కప్‌లో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహారిస్తున్నాడు.

 పంజాబ్‌లోని ఫాజిల్కా పట్టణంలో జన్మించిన గిల్

పంజాబ్‌లోని ఫాజిల్కా పట్టణంలో జన్మించిన గిల్

పంజాబ్‌లోని ఫాజిల్కా పట్టణంలో 1999, సెప్టెంబర్‌ 8న జన్మించిన శుభ్‌మాన్‌ గిల్ క్రికెటర్‌ కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు తండ్రిని ఒప్పించి తన సొంత గ్రామం నుంచి కుటుంబంతో సహా మొహాలికి తరలి వెళ్లాడు. తండ్రి లఖ్విందర్ సింగ్ ఓ రైతు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన శుభమాన్ గిల్ కఠోర సాధన, క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు.

 దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం

దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం

దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బెంగాల్‌తో తన మొదటి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడాడు. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన గిల్‌.. రెండో మ్యాచ్‌లో సెంచరీని నమోదు చేశాడు. 2014లో జరిగిన అండర్‌-16 పంజాబ్‌ అంతర్‌ జిల్లా టోర్నీలో 351 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్‌లో నిర్మల్‌ సింగ్‌తో కలిసి తొలి వికెట్‌కు 587 భాగస్వామ్యం నమోదు చేశాడు.

 అరంగేట్రం చేసిన అండర్-16 మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ

అరంగేట్రం చేసిన అండర్-16 మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ

అనంతరం విజయ్‌ మర్చంట్‌ ట్రోఫిలో పంజాబ్‌ తరపున అరంగ్రేటం చేసిన అండర్-16 మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. 2013-14, 2014-15లో వరుసగా రెండుసార్లు బెస్ట్‌ జూనియర్‌ క్రికెటర్‌గా బీసీసీఐ అవార్డుని అందుకున్నాడు. తన అభిమాన క్రికెటర్‌ కోహ్లీ చేతుల మీదుగా 2014లో అవార్డు అందుకుని మురిసిపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన అండర్-19 వన్డే సిరిస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని గెలుచుకున్నాడు.

భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర

భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర

ప్రస్తుతం జరుగుతోన్న అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 63, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లో 90 పరుగులు నమోదు చేశాడు. ఇక, క్వార్టర్ ఫైనల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

వేలంలో రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా

వేలంలో రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా

ఈ మ్యాచ్ ఐపీఎల్ వేలంకు ముందు జరగడంతో బెంగళూరు వేదికగా నిర్వహించిన వేలంలో రూ.1.8 కోట్లకు శుభమాన్ గిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో రాహుల్ ద్రవిడ్ ఎల్లప్పుడూ ముందుంటాడు. అలాంటి రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో శుభమాన్ గిల్‌ మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిద్దాం.

Story first published: Tuesday, January 30, 2018, 17:39 [IST]
Other articles published on Jan 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+