Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విదర్భ రంజీ విజేతగా నిలవడంలో కీలకపాత్ర: ఎవరీ గుర్బానీ

హైదరాబాద్: దేశవాళీ రంజీ క్రికెట్ టోర్నీలో విదర్భ చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లోని హోల్కర్‌ మైదానంలో జరిగిన రంజీ ట్రోఫీ 2017-18 సీజన్‌ ఫైనల్‌లో ఢిల్లీపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే విదర్భ రంజీ విజేతగా అవతరించడంలో యువ పేస్ బౌలర్ రజినీశ్ గుర్బానీ కీలకపాత్ర పోషించాడు.

రంజీ ఫైనల్ చరిత్రలోనే రెండో వాడిగా గుర్బానీ రికార్డు

అంతేకాదు ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో(39) బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. 2017-18 రంజీ సీజన్‌ ఆరంభం నుంచే అద్భుత ప్రదర్శన చేసిన గుర్బానీ ముఖ్యంగా నాకౌట్స్‌లో తనదైన శైలిలో విజృంభించాడు. మూడు సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

Winning Ranji Trophy Is The Biggest Achievement Of My Career - Faiz
 గుర్బానీ ఒక్కడే 27 వికెట్లు

గుర్బానీ ఒక్కడే 27 వికెట్లు

విదర్భ జట్టులోని మిగతా బౌలర్లు అందరూ కలిసి 32 వికెట్లు తీస్తే, గుర్బానీ ఒక్కడే 27 వికెట్లు తీశాడు. అంతేకాదు ఈ సీజన్‌లో నాలుగు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇక, ఫైనల్లో హ్యాట్రిక్ తీసి, ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. గుర్బానీకి ముందు తమిళనాడు బౌలర్ కల్యాణ సుందరం 1973లో ముంబైతో జరిగిన ఫైనల్లో హ్యాట్రిక్ తీశాడు.

 ఎవరీ గుర్బానీ

ఎవరీ గుర్బానీ

ఈ క్రమంలో ఎవరీ గుర్బానీ అనే వార్త తెరపైకి వచ్చింది. 1993లో నాగ్‌పూర్‌లో జన్మించిన గుర్బానీ, ముంబైలో పాఠశాల స్థాయి నుంచే క్రికెట్‌ ఆడాడు. కుటుంబం నాగ్‌పూర్‌లో స్థిరపడిన తర్వాత అక్కడి స్థానిక టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ... రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యాడు.

 2015లో తొలిసారిగా విదర్భ తరుపున అరంగేట్రం

2015లో తొలిసారిగా విదర్భ తరుపున అరంగేట్రం

క్రికెట్లో పడి చదువును నిర్లక్ష్యం చేయొద్దని తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని సివిల్ ఇంజినీర్‌కు అర్హత సాధించాడు. 2015లో తొలిసారిగా విదర్భ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత ఏడాది అనంతరం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

 గుర్బానీ బంతుల్లో స్వింగ్

గుర్బానీ బంతుల్లో స్వింగ్

2017-18 రంజీ సీజన్లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌‌లో గుర్బానీ (6/113) రాణించడంతో ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు. నిజానికి గుర్బానీ బౌలింగ్‌లో పెద్దగా వేగం ఉండదు. 130-135 స్పీడ్‌తో బంతులు విసురుతాడు. అయితే గుర్బానీ బంతుల్లో స్వింగ్ ఉంటుంది.

 విదర్భకు 5 కోట్ల నజరానా

విదర్భకు 5 కోట్ల నజరానా

రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన విదర్భకు రూ.5 కోట్ల నజరానా లభించింది. ట్రోఫీ గెలిచినందుకు విజేతకు దక్కే రూ.2 కోట్లతో పాటు విదర్భ క్రికెట్ అసోసియేషన్(వీసీఏ) రూ.3 కోట్లు ప్రకటించింది.

మ్యాచ్ హైలెట్స్:

మ్యాచ్ హైలెట్స్:

* రంజీ ట్రోఫీని గెలిచేందుకు విదర్భ వేచి చూసిన సీజన్‌ల సంఖ్య 61. రాజస్థాన్ జట్టు 60 సీజన్‌ల నుంచి వేచి చూడగా, ఉత్తర ప్రదేశ్ (72), గుజరాత్ (83) విదర్భ కంటే ముందున్నాయి.

* ఈ సీజన్‌లో 25 కంటే ఎక్కువ వికెట్లు తీసిన విదర్భ బౌలర్ల సంఖ్య 3. ఏ జట్టుకైనా ఇదే అత్యుత్తమం. అంతకముందు ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ తరుపున ఇద్దరు బౌలర్లు ఈ ఘనత సాధించారు.

* ఈ సీజన్‌లో 500కు పైగా పరుగులను నలుగురు విదర్భ బ్యాట్స్‌మెన్ (ఫజల్, సంజయ్, సతీశ్, జాఫర్) సాధించారు. అంతకముందు కర్ణాటక, ఢిల్లీ బ్యాట్స్‌మెన్ (ముగ్గురు) పేరిట ఈ రికార్డు ఉంది.

సంక్షిప్త స్కోర్లు:

సంక్షిప్త స్కోర్లు:

ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ 295 ఆలౌట్

విదర్భ తొలి ఇన్నింగ్స్ 547 ఆలౌట్

ఢిల్లీ రెండో ఇన్నింగ్స్ 280 ఆలౌట్

విదర్భ రెండో ఇన్నింగ్స్ 32/1

Story first published: Tuesday, January 2, 2018, 11:38 [IST]
Other articles published on Jan 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+