Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: ఇదంతా ఫ్యాన్స్ కోసమే చేస్తున్నా- ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనీ బయట మాట్లాడిన సందర్భాలు అరుదుగా కనిపిస్తుంటాయి. దీంతో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగుతున్నప్పుడు టాస్, మ్యాచ్ ముగిసిన సందర్భాల్లోనే ధోనీ మాటలను ఫ్యాన్స్ ఎక్కువగా వినగలుగుతున్నారు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో ధోనీ తన ఫ్యాన్స్ గురించి మాట్లాడాడు.

''ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారని లాంగ్ హెయిర్ పెంచుకుంటున్నా. అయితే యాడ్స్ షూటింగ్‌ కోసం రెడీ అవ్వడానికి లాంగ్ హెయిర్ వల్ల ఆలస్యం అవుతుంది. గతంలో 20 నిమిషాల్లో మేకప్ పూర్తి అయ్యేది. కానీ ఇప్పుడు రెడీ అవ్వడానికి గంట అయిదు నిమిషాల నుంచి గంట పది నిమిషాల వరకు సమయం పడుతుంది''

All this is done for my fans - MS Dhoni

''మేకప్ కోసం అంతసేపు కుర్చీలో కూర్చొని ఉండటం బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ నా ఫ్యాన్స్ అందరూ హెయిర్ స్టైల్‌ బాగుందని చెబుతున్నారు. ఇలా మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. కానీ మరి కొంతకాలం ఇలానే ఉంచడానికి ప్రయత్నిస్తా. అలాగే ఏదో ఓక మంచి రోజు చూసి కట్ చేస్తా'' అని ధోనీ అన్నాడు.

ధోనీ లాంగ్ హెయిర్‌తోనే కెరీర్‌ను ఆరంభించాడు. భారత్‌కు తొలి టీ20 ప్రపంచకప్ అందించిన సందర్భంలోనూ ధోనీ అదే హెయిర్ స్టైల్‌తో మెరిశాడు. తర్వాత హెయిర్ స్టైల్స్‌ను మార్చుకుంటూ వచ్చాడు. మళ్లీ తిరిగి మునపటిలా జుట్టును పెంచుతున్నాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడుస్తున్నా ఐపీఎల్‌లో ట్రోఫీ వేటలో ఇప్పటికీ ధోనీ ముందున్నాడు. 2023 సీజన్‌లో చెన్నైను మరోసారి విజేతగా నిలిపాడు. 42 ఏళ్ల ధోనీ ఈ ఏడాది మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, December 28, 2023, 11:15 [IST]
Other articles published on Dec 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+