సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు టీమిండియా తరఫున సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగాడు. రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే తన తడాఖా చూపించాడు. పేసర్లతో పాటు స్పిన్నర్లు దీటుగా ఎదుర్కొంటూ భవిష్యత్ తారగా అంచనాలను నెలకొల్పాడు.
అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు రాజ్‌కోట్ స్టేడియం ఉద్వేగభరితంగా మారింది. యువ క్రికెటర్లు సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్ టెస్టు క్యాప్‌ను అందుకున్న తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా సర్ఫరాజ్, దినేశ్ కార్తీక్ చేతుల మీదుగా ధ్రువ్ భారత టెస్టు క్యాప్‌ను అందుకున్నారు.

సర్ఫరాజ్ క్యాప్‌ను అందుకున్న అనంతరం తన ఫ్యామిలీ దగ్గరకు వెళ్లాడు. తన తండ్రి నౌషద్ ఖాన్, తన భార్య రోమన జహూర్‌ను కలుసుకుని కల నెరవేరిందంటూ తన క్యాప్‌ను చూపించాడు. ఆ క్షణంలో వాళ్లంతా కన్నీటినీ ఆపుకోలేకపోయారు. తన తండ్రి నౌషద్ ఖాన్.. సర్ఫరాజ్‌ను కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యాడు.
అయితే సర్ఫరాజ్ ఖాన్ భారత టెస్టు క్యాప్ అందుకున్న క్షణాన్ని ప్రత్యక్షంగా వీక్షించాడనికి టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కారణమని సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ తెలిపారు. ముంబయిలో ఉండాల్సిన తనని రాజ్‌కోట్‌కు వెళ్లమని సూర్య సూచించాడని పేర్కొన్నారు. జీవితంలో ఇలాంటి క్షణాలు ఎప్పటికీ రావని చెప్పి సూర్య తనని ఒప్పించి పంపించాడని వివరించారు.
''కాస్త నలతగా ఉన్న నేను ముంబయిలోనే ఉందామనుకున్నా. కానీ సూర్యకుమార్ యాదవ్ వల్ల రాజ్‌కోట్‌కు వచ్చాను. ఇలాంటి క్షణాలు మళ్లీ రావని, జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయని, వాటిని ఆస్వాదించాలని నన్ను ఒప్పించాడు'' అని నౌషద్ ఖాన్ తెలిపాడు.
కాగా, రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ (62; 66 బంతుల్లో) దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. రవీంద్ర జడేజా 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సర్ఫరాజ్ పెవిలియన్‌కు చేరాడు. అయితే వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ సర్ఫరాజ్ బౌండరీల మోత మోగించాడు. 48 బంతుల్లో అర్ధశతకం సాధించి రికార్డు సృష్టించాడు. అరంగేట్ర టెస్టులో అత్యంత వేగంగా అర్ధసెంచరీ బాదిన రెండో భారత ప్లేయర్‌గా హార్దిక్ పాండ్యతో సంయుక్తంగా చరిత్రకెక్కాడు. టాప్‌లో యువరాజ్ సింగ్ (42 బాల్స్) ఉన్నాడు.
తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ అయిదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (110), కుల్‌దీప్ (1) ఉన్నారు. రోహిత్ శర్మ (131) శతకం సాధించాడు. జైస్వాల్ (10), రజత్ పటిదార్ (5), గిల్ (0) నిరాశపరిచారు.