ఆటలో రూల్స్‌ను వివరించేందుకే
ఈ సమావేశానికి ఐపీఎల్ 10వ సీజన్‌లోని ఎనిమిది జట్ల కెప్టెన్లు డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, జహీర్ ఖాన్, స్మిత్, మ్యాక్స్‌వెల్‌లు హాజరయ్యారు. బుధవారం ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మ్యాచ్‌లకు సంబంధించి ఆటలో రూల్స్‌ను వివరించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.
సెల్ఫీలు దిగిన ఎనిమిది జట్ల కెప్టెన్లు
ఈ సమావేశం అనంతరం ఎనిమిది జట్ల కెప్టెన్లు కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సెల్ఫీలను ట్విట్టర్ ద్వారా ఐపీఎల్ నిర్వాహకులు ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈసారి ఐపీఎల్ పదో సీజన్ కావడంతో ప్రారంభోత్సవ వేడుకలు విభిన్నంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
8 వేదికల్లో ఆరంభ వేడుకలు
ఇందులో భాగంగా స్థానిక ప్రేక్షకులకు సైతం వినోదం పంచాలన్న ఫ్రాంచైజీల కోరిక మేరకు ఈసారి 8 వేదికల్లో ఆరంభ వేడుకల్ని నిర్వహించాలని ఐపీఎల్ పాలక మండలి నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, మొహాలీ, ముంబై, పుణె, రాజ్‌కోట్‌లో ఈ వేడుకలు జరుగుతాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు.
ఉప్పల్ స్టేడియంలో ఆరంభ వేడుకలు
బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియంలో ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. అరగంట సేపు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ నటి అమీ జాక్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
బుధవారం సాయంత్రం 6:20కి ప్రారంభ వేడుక
రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 6:20కి ప్రారంభ వేడుక మొదలుకానుంది. తొలుత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు గోల్ఫ్ కార్ట్‌లలో మైదానంలోకి ప్రవేశిస్తారు. ఆపై వీరి ఘనతలు, సాధించిన రికార్డులను గురించి ప్రస్తావిస్తూ, ఆడియో, వీడియో ప్రదర్శన ఉంటుంది.


Click it and Unblock the Notifications