టెస్ట్‌ల్లో ఆ అవకాశమిస్తే అదృష్టంగా భావిస్తా: వాషింగ్టన్ సుందర్

చెన్నై: ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించిన భారత జట్టుకు ఈసారి చాలా మంది కొత్త హీరోలు దొరికారు. అందులో 21 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ కూడా ఒకడు. గబ్బా టెస్ట్‌లో అరంగేట్రం చేసిన ఈ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్.. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను భారత్ నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. గబ్బాలో నాలుగు వికెట్లు తీసిన ఈ యువ క్రికెటర్.. ఆ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్‌తో కలిసి బ్యాట్‌తో అద్బుతం చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో టార్గెట్ చేజింగ్‌లో టెన్షన్ తగ్గించాడు.

అరంగేట్రం మ్యాచ్‌తోనే హీరోగా మారిన ఈ తమిళనాడు కుర్రోడు... అవకాశమిస్తే ఓపెనర్‌గా కూడా రాణిస్తానంటున్నాడు. కోచ్ రవిశాస్త్రి ఇచ్చిన స్పూర్తి వల్లే సక్సెస్ సాధించానన్న ఈ లెఫ్టాండ్ బ్యాట్స్‌మన్.. నెట్‌బౌలర్‌గా గంటల తరబడి బౌలింగ్ చేయడం తనకు కలిసొచ్చిందన్నాడు. స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచిన ఈ యువ ఆల్‌రౌండర్.. బ్రిస్బేన్‌లో తన సంచలన అరంగేట్రంతోపాటు భవిష్యత్తు ప్రణాళికల గురించి పీటీఐ వార్త సంస్థతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అవకాశమిస్తే ఓపెనింగ్ చేస్తా..

అవకాశమిస్తే ఓపెనింగ్ చేస్తా..

‘టెస్ట్‌ల్లో భారత్ తరఫున ఓపెనర్‌గా ఆడే అవకాశం వస్తే నాకు దక్కిన అదృష్టంగా భావిస్తా. మా కోచ్ రవి సర్ తాను ఆడే రోజుల్లో ఎలాంటి సవాల్‌కైనా ఏ విధంగా సిద్దంగా ఉండేవారో.. నేను కూడా ఆయనలాగే సవాళ్లు స్వీకరిస్తా. డ్రెస్సింగ్ రూమ్‌లో రవిసర్ తన కెరీర్‌కు సంబంధించిన చాలా విషయాలు మాతో పంచుకున్నారు. అవన్నీ చాలా స్పూర్తిని కలిగించేవి. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా న్యూజిలాండ్‌పై ఆయన టెస్ట్ అరంగేట్రం చేయడం. తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లు సాధించడం, పదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం గురించి చెప్పారు. అక్కడి నుంచి ఆయన ఓపెనర్‌గా ఎలా మారారు. అప్పటి గొప్ప ఫాస్ట్ బౌలర్లను ఎలా ఎదుర్కొన్నాడు వంటివి మాతో పంచుకున్నారు. అవకాశం దొరికితే నేను కూడా ఆయనలాగే భారత్ తరఫున టెస్ట్‌ల్లో ఇన్నింగ్స్ ఓపెన్ చెయ్యాలనుకుంటున్నా.

డ్రెస్సింగ్ రూమ్ అద్భుతం..

డ్రెస్సింగ్ రూమ్ అద్భుతం..

ఓ యువఆటగాడిగా ఇన్స్‌పిరేషన్, మోటివేషన్ కోసం నేను ఎక్కడో వెతుక్కోవాల్సిన పనిలేదు. మా డ్రెస్సింగ్ రూమ్‌లోనే కావాల్సినంత మంది గొప్ప ప్లేయర్లున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, అశ్విన్‌తో పాటు చాలా మంది గొప్ప ఆటగాళ్లు మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు. వీళ్లలో ఎవరిని ఏ డౌట్ అడిగినా సరే సాయం చేయడానికి ముందుకు వస్తారు. ధైర్యం నింపి కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తారు.

అంతా అరుణ్ సార్ ప్లానే..

అంతా అరుణ్ సార్ ప్లానే..

మా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ సార్ చేసిన ప్రణాళిక వల్లే టెస్ట్‌ల కోసం నన్ను నెట్ బౌలర్‌గా ఆసీస్‌లోనే ఉంచారు. అదే నాకు చాలా లాభం చేసింది. ఆస్ట్రేలియా పిచ్‌ల్లో సాధారణంగా పేస్, బౌన్స్ ఎక్కువ లభిస్తాయి. అందువల్ల స్లో బాల్స్ వేయకూడదు. దాంతో డెలివరీలో కొంచెం ఫ్లయిట్‌తో పాటు బౌన్స్ ఉండేలా చూసుకున్నాం. అలా బౌలింగ్ చేయగలిగితే వికెట్ మీద పేస్‌ను ఉపయోగించుకోవచ్చు. నెట్ సెషన్స్‌లో దానిపైనే ఎక్కువ దృష్టిపెట్టా. అనుకున్నట్లుగానే బ్రిస్బేన్ టెస్ట్ తొలి రోజూ పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం లేదు. అయినా నేను తొలి వికెట్‌గా స్టీవ్ స్మిత్‌ను ఔట్ చెయ్యడంతో కల నెరవేరినట్టు అనిపించింది.

ఆ నమ్మకం ఉంది..

ఆ నమ్మకం ఉంది..

గబ్బా టెస్ట్ చివరి రోజు ఆటలో ఆఖరి 10 ఓవర్లలో మేము 50 పరుగులకు వరకు సాధించాల్సి ఉంది. కానీ రిషభ్ పంత్‌తో కలిసి టార్గెట్ చేజ్ చెయ్యగలమని నమ్మకం ఉంది. క్రీజులో ఓవైపు రిషభ్ పంత్ ఉండటం వల్ల ఆసీస్ బౌలర్లు చాలా ఒత్తిడిలో ఉన్నారన్న సంగతి మాకు అర్థమైంది. దాంతో 25 నుంచి 30 పరుగులు వేగంగా చెయ్యగలిగితే లక్ష్యచేధన సులువు అవుతుందని గ్రహించాం. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్, నేను చాలా మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. ఆ టైమ్‌లో ఠాకూర్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, January 25, 2021, 9:44 [IST]
Other articles published on Jan 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X