
గాయంతో దూరం
వెన్ను నొప్పి గాయం కారణంగా తాను ఈ సారి ఐపీఎల్‌లో ఆడడం లేదని కుర్రాన్ వెల్లడించాడు. ఇదే కారణంతో కుర్రాన్ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌తోపాటు యాషెస్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. 23 ఏళ్ల సామ్ కుర్రాన్ గతంలో ఐపీఎల్‌లో చెన్నైసూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ ఏడాది చైన్నై రిటెన్ష్‌న్ జాబితాలో కుర్రాన్ పేరు లేదు. దీంతో అతను వేలానికి వెళ్లకు తప్పని పరిస్థితి నెలకొంది. కాగా చెన్నై ఈ సీజన్‌కు ధోని, జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.

కుర్రాన్ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడిన ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ 22 సగటుతో 337 పరుగుటు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉండగా అత్యధిక పరుగులు 55. 149 సగటుతో బ్యాటింగ్ చేసిన సామ్ కుర్రాన్ 30 ఫోర్లు, 18 సిక్స్‌లు బాదాడు. అలాగే బౌలింగ్‌లో 32 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/11.

ఇప్పటికే పలువురు దూరం
ఐపీఎల్ మెగా వేలానికి ఇప్పటికే పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరమయ్యారు. ఆ జట్టు టెస్టు కెప్టెన్ జో రూట్‌తోపాటు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. అలాగే మరికొంత మంది కూడా వేలానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ సారి ఐపీఎల్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్ల సంఖ్య తగ్గనుంది.

వేలంలో ఎంత మందంటే
ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా జరగనున్న మెగా వేలానికి ఇప్పటికే ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైంది. 896 మంది భారత ఆటగాళ్లు, 318 మంది విదేశీ ఆటగాళ్లు కలుపుకోని మొత్తం 1214 మంది వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

వేదికపై సందిగ్ధం
ఈ సారి ఐపీఎల్ 10 జట్లతో జరగనుంది. అయితే వేదికపై సందిగ్దత కొనసాగుతుంది. ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నప్పటికీ కరోనా అడ్డు తగులుతుంది. దీంతో లీగ్‌ను బీసీసీఐ విదేశాలకు తరలించే ఆలోచన చేస్తుంది. ఇందుకోసం ప్రత్యామ్నాయ వేదికలుగా శ్రీలంక, యూఏఈ, సౌతాఫ్రికాలను పరిశీలిస్తోంది. అయితే ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి ఇండియాలో కరోనా కేసులు తగ్గు ముఖం పడితే లీగ్ ఇక్కడే నిర్వహించాలని బీసీసీఐ కసరత్తు చేస్తోంది.


Click it and Unblock the Notifications












