Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విండిస్‌తో టెస్టు సిరిస్: అరుదైన రికార్డుకి చేరువలో రవీంద్ర జడేజా

 All Rounder Ravindra Jadeja eyes major landmark in India vs West Indies Tests

హైదరాబాద్: వెస్టిండిస్‌తో గురువారం నుంచి ప్రారంభమ్యయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. టెస్టుల్లో 200 వికెట్లు తీసేందుకు జడేజా ఇంకా ఎనిమిది వికెట్ల దూరంలో ఉన్నాడు. నార్త్‌ సౌండ్‌లో సర్‌ వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో విండిస్‌తో గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది.

ఈ టెస్టులో గనుక జడేజా ఎనిమిది వికెట్లు తీస్తే... భారత్ తరుపున ఈ ఘనత సాధించిన పదో బౌలర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. దీంతో పాటు టెస్టుల్లో రెండొందల వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్‌గా అరుదైన గుర్తింపు పొందుతాడు. ఈ జాబితాలో స్పిన్నర్ రవి చంద్రన్‌ అశ్విన్‌ ముందంజలో ఉన్నాడు.

192 వికెట్లు తీసిన జడేజా

192 వికెట్లు తీసిన జడేజా

ఇప్పటివరకు భారత్ తరుపున 41 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జడేజా 192 వికెట్లు సాధించాడు. కాగా, అశ్విన్‌ 37 టెస్టు మ్యాచ్‌ల్లోనే 200 వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్థానంలో హర్భజన్‌ సింగ్‌ 46 టెస్టుల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. విండిస్‌తో జరగనున్న ఈ సిరిస్‌లో భజ్జీ రికార్డుని జడేజా బద్దలు కొట్టే అవకాశం ఉంది.

అత్యంత వేగంగా రెండొందల వికెట్లు

అత్యంత వేగంగా రెండొందల వికెట్లు

మొత్తంగా చూస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా రెండొందల వికెట్లు సాధించిన జాబితాలో యాసిర్‌ షా(33), గ్రిమ్మిట్‌(36 టెస్టులు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో అశ్విన్‌ కొనసాగుతున్నాడు. సోమవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

గురువారం నుంచి విండిస్‌తో తొలి వన్డే

గురువారం నుంచి విండిస్‌తో తొలి వన్డే

విండిస్‌తో గురువారం నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టులో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనే యోచనలో టీమిండియా ఉంది. దీంతో జడేజాకు తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఒకవేళ కుల్దీప్‌ యాదవ్‌ను తుది జట్టులో ఆడించాలని భావిస్తే జడేజాకు చోటు దక్కడం కష్టమే.

టీమిండియా అద్భుత ప్రదర్శన

టీమిండియా అద్భుత ప్రదర్శన

విండిస్ పర్యటనలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకున్న కోహ్లీసేన.... అనంతరం జరిగిన వన్డే సిరిస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా... మిగిలిన రెండు వన్డేల్లో కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఒక దశాబ్దంలో 20,000 పరుగులు

ఒక దశాబ్దంలో 20,000 పరుగులు

మూడు వన్డేల సిరిస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 234 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు ఒక దశాబ్దంలో 20,000 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు విండిస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

Story first published: Tuesday, August 20, 2019, 12:51 [IST]
Other articles published on Aug 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+