RR vs GT: టీమిండియాకు గుడ్ న్యూస్.. వరల్డ్‌కప్‌నకు సూపర్ ఫామ్‌లో హార్దిక్.. ఐపీఎల్‌లో విశ్వరూపం


టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2022లో చెలరేగుతున్నాడు. ఇటు బ్యాట్‌తో, అటు బాల్‌తో రాణిస్తూ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా ప్రతి మ్యాచ్‌లో కనీస పరుగులు చేస్తున్నాడు. బాల్‌తోనూ ప్రతి మ్యాచ్‌లో పూర్తి బౌలింగ్ కోటాను పూర్తి చేస్తున్నాడు. అలాగే వికెట్లు తీస్తున్నాడు. పూర్తిగా ఫిట్‌గా కూడా ఉన్నాడు. ప్రస్తుత ఫామ్‌తో టీమిండియాలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఖరారు అయిందనే చెప్పుకోవాలి.
చెలరేగిన హార్దిక్ పాండ్యా
ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చెలరేగాడు. మూడో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా కష్టాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను కెప్టెన్‌గా ఆదుకున్నాడు. ఈ క్రమంలో శుభ్‌మాన్ గిల్, అభినవ్ మనోహర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పి టీంను పటిష్ట స్థితిలో ఉంచాడు. అలాగే ఐపీఎల్‌లో 33 బంతుల్లో ఆరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, ఒక సిక్సు కొట్టాడు. ఈ సీజన్‌లో ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ. ఇక చివరి ఓవర్లలో డేవిడ్ మిల్లర్‌తో కలిసి స్కోర్ బోర్డును పాండ్యా పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి 27 బంతుల్లోనే 53 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుజారాత్ 192 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 4 సిక్సులతో అజేయంగా నిలిచాడు.

నిలకడైన ప్రదర్శన
ఈ ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా నిలకడైన ప్రదర్శన ఇస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌లో 33, రెండో మ్యాచ్‌లో 31, మూడో మ్యాచ్‌లో 27, నాల్గో మ్యాచ్‌లో 50*, తాజా మ్యాచ్‌లో 87* పరుగులతో దుమ్ములేపాడు. మొత్తంగా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 228 పరుగులు చేశాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. అంతేకాకుండా చివరి రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ పాండ్యా ఔట్ కాలేదు. అలాగే ప్రతి మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్ కోటా కూడా పూర్తి చేస్తున్నాడు. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు.

టీమిండియాలోకి రీఎంట్రీ
ఈ ప్రదర్శనను బట్టి టీమిండియాలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఖాయమనే చెప్పుకోవాలి. కాగా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా కొంత కాలంగా హార్దిక్ పాండ్యాను సెలెక్టర్లు టీమిండియాకు దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో టీమిండియాలో వెంకటేష్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడం కష్టమే అనిపించింది. కానీ తాజా ఫర్‌ఫామెన్స్‌తో టీమిండియాలో ఎంపికవడం దాదాపు ఖాయమనే చెప్పుకోవాలి. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో పాండ్యా వంటి అనుభవజ్ఞుడైన స్టార్ ఆల్‌రౌండర్‌కు జట్టులో చోటు కల్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒక రకంగా హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్‌లో ఉండడం టీ20 వరల్డ్‌కప్‌నకు సిద్ధమవుతున్న టీమిండియాకు గుడ్ న్యూస్ అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications