Hardik Pandya: విలాస పురుషుడు మరి: కోట్ల రూపాయల ధర పలికే రిస్ట్ వాచ్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. అనామక క్రికెటర్లను స్టార్ ప్లేయర్లుగా మార్చుతోంది. ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చి పెడుతోంది. వారి నెత్తిన కోట్ల రూపాయలను గుమ్మరించేలా చేస్తోంది. ఐపీఎల్ సీజన్లు, ఫ్రాంఛైజీల సిస్టమ్ ఆరంభమైన తరువాత వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలు నమోదవుతోన్నాయి. బెట్టింగ్ రేంజ్ కూడా అదే స్థాయిలో నమోదవుతోంది. క్రికెట్ దశ, దిశను సమూలంగా మార్చివేసిన టోర్నమెంట్ ఇది. టాలెంట్ ఉన్న క్రికెటర్లను కోటీశ్వరులుగా చేసింది. విలాస పురుషులుగా మార్చేసింది.

ఓవర్‌నైట్ స్టార్ డమ్
ఐపీఎల్ టోర్నమెంట్‌తో ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను సాధించిన క్రికెటర్ల లిస్ట్‌లో చేరారు పాండ్య బ్రదర్స్. హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య.. ఇద్దరూ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. అసలే పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన ఫ్రాంఛైజీ అది. రిలయన్స్ అధినేత భార్య నీతా అంబానీ ఈ ఫ్రాంఛైజీ చీఫ్. జట్టును విజయపథాన నడిపించే క్రికెటర్లపై కనకవర్షాన్ని కురిపించడానికి ఏ మాత్రం వెనకాడని ఫ్రాంచైజీగా క్రికెట్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకుంది.

లగ్జరీ లైఫ్
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్‌లో చేరడంతోనే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇదివరకెలా ఉండేవాడో తెలియదు గానీ.. ఐపీఎల్ సీజన్లు కొనసాగుతున్న కొద్దీ కోట్ల రూపాయలకు పడగలెత్తుతూ వస్తోన్నాడు. ఇప్పటికే కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తులను కూడబెట్టుకున్నాడు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన రుస్తోంజీ పారామౌంట్ సొసైటీలో లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు పాండ్యా బ్రదర్స్.
కోట్ల రూపాయలతో ఫ్లాట్..
3,838 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫ్లాట్ విలువ 30 కోట్ల రూపాయల పైమాటే. మొత్తం ఎనిమిది గదులు ఉండే ఫ్లాట్ అది. ఇందులోనే హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య తమ కుటుంబాలతో కలిసి నివసిస్తోన్నారు. విలాసవంతమైన వస్తవులకు లెక్కే లేదు. గత ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత క్రికెట్లరందరూ స్వదేశానికి చేరుకున్నప్పటికీ.. కృనాల్ పాండ్య మాత్రం దుబాయ్‌లో భారీ ఎత్తున షాపింగ్ చేసి మరీ.. ఇంటికొచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.

కళ్లు బైర్లు కమ్మే రిస్ట్ వాచ్ ప్రైస్ ట్యాగ్..
ఇప్పుడు తాజాగా హార్దిక్ పాండ్య మళ్లీ వార్తల్లోకెక్కాడు. ఈ సారి అతనుె ఓ రిస్ట్ వాచ్‌ను కొన్నాడు. రిస్ట్ వాచ్ కొనడం పెద్దగా చెప్పుకోదగ్గ వార్తేమీ కాదు గానీ.. దాని రేటే మైండ్ బ్లాక్ చేస్తోంది. కొత్తగా అతను పటేక్ ఫిలిప్పీ నాటిలస్ ప్లాటినమ్ 5711 వాచ్‌ను కొనుగోలు చేశాడు. దాని ధర అయిదు కోట్ల రూపాయల పైమాటే. ఈ వాచ్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని అతను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. వాచ్ ఫొటోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

సత్తా చాటగలడా?
వచ్చేనెలలో ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేస్ మ్యాచ్‌లు ఆరంభం కాబోతోన్నాయి. గత ఏడాది తరహాలోనే ఈ సారి కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుధాబి, దుబాయ్, షార్జా స్టేడియాలు ఈ సెకెండ్ ఫేస్ టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్నాయి. ప్రస్తుతం అందరి దృష్టీ హార్దిక్ పాండ్య మీదే నిలిచింది. ఐపీఎల్‌లో అతని పెర్‌ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది. శ్రీలంక సిరీస్‌లో హార్దిక్ ఏ మాత్రం రాణించలేకపోయాడు. దీనికి కారణం అతని బ్యాక్ పెయిన్. తాను పూర్తి ఫిట్‌నెస్‌గా ఉన్నానంటూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను పోస్ట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications