కేప్‌టౌన్: బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన 'ప్రపంచకప్ హీరో' బెన్ స్టోక్స్ బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. స్టోక్స్ (3/35) ఇన్నింగ్స్ చివరలో మ్యాజిక్ చేయడంతో.. డ్రా దిశగా సాగుతున్న కేప్‌టౌన్ టెస్టు ఇంగ్లండ్ సొంతమైంది. మంగళవారం దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 189 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 4 టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమం చేసింది.
మే 24న ఐపీఎల్ 2020 ఫైనల్.. రాత్రి 7.30 నుంచే మ్యాచ్‌లు?
438 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగళవారం 126/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటకొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 137.4 ఓవర్లలో 248 పరుగుల వద్ద ఆలౌటైంది. ఐదో రోజు ఆటకు దిగిన సఫారీలకు ఆదిలోనే షాక్ తగిలింది. కేశవ్ మహారాజ్ (2)త్వరగానే పెవిలియన్ చేరాడు. అనంతరం కెప్టెన్ డుప్లెసిస్ (17) కొన్ని బంతులాడినా.. తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఆది నుంచి ఒంటరి పోరాటం చేసిన ఓపెనర్ పీటర్ మలన్ (84) కూడా ఔటవడంతో దాదాపు సఫారీల ఓటమి ఖరారైంది.
అయితే క్వింటన్ డికాక్ (50) అర్ధ శతకంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. డసెన్ (140 బంతుల్లో 17) అతడికి తోడుగా నిలిచాడు. జట్టు స్కోరు 237 పరుగుల వద్దే ఈ జోడి పెవిలియన్ చేరింది. చివరి సెషన్లో ఇంకా 13 ఓవర్లు మిగిలుండగా.. అప్పటికి సఫారీ జట్టు ఏడు వికెట్లను కోల్పోయింది. మిగతా మూడు వికెట్లతో 13 ఓవర్లు ఆడితే సరిపోయేది. కానీ.. బెన్ స్టోక్స్ ఆ అవకాశమివ్వలేదు. ఇన్నింగ్స్ 134వ ఓవర్ వేసిన స్టోక్స్.. వరుస బంతుల్లో ప్రిటోరియస్ (0), నోర్జే (0)లను డకౌట్ చేశాడు. దీంతో సఫారీ 'డ్రా' ఆశలు ఆవిరయ్యాయి.
చివరి రోజు డికాక్ (50; 7 ఫోర్లు) మినహా ఇంకెవరూ ప్రతిఘటించలేకపోయారు. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో ఇంగ్లండ్ సమం చేసింది. ఇంగ్లండ్ 269, 391/8 (డిక్లేర్డ్) చేయగా.. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' స్టోక్స్‌కు దక్కింది. ఈ నెల 16 నుంచి పోర్ట్ ఎలిజబెత్‌లో మూడో టెస్టు జరుగుతుంది.