
బ్యాటింగ్ వైఫల్యం
గురువారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్.. నైట్ రైడర్స్ నాసిరకం ఆటతీరుకు అద్దం పట్టింది. బ్యాటింగ్‌లో ఏ మాత్రం రాణించలేకపోయింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ జట్టును 154 పరుగులకే పరిమితం చేసింది. డెత్ ఓవర్లలో ఆండ్రీ రస్సెల్ చెలరేగిపోయి ఆడకపోయి ఉంటే.. ఆ మాత్రం పరుగులు కూడా స్కోర్ కూడా సాధ్యం అయ్యేది కాదు. ఆండ్రీ రస్సెల్.. 27 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు.

బౌలింగ్ అట్టర్ ఫ్లాప్
కోల్‌కత బౌలింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో.. తొలి ఓవర్‌లోనే అర్థమై పోయింది. ఇన్నింగ్ తొలి ఓవర్‌లోనే శివమ్ మావి ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు. అందులో ఒకటి వైడ్ కూడా. ఆరు బంతులకు ఆరు ఫోర్లను బాదాడు పృథ్వీ షా. ఐపీఎల్‌లో మోస్ట్ కాస్ట్‌లీ బౌలింగ్ అది. ఆ తరువాత శివమ్‌కు బంతిని అప్పగించే సాహసం చేయలేకపోయాడు కేప్టెన్ ఇవాన్ మోర్గాన్. ఢిల్లీ కేపిటల్స్ జట్టులో అవుట్ అయిన ముగ్గురు బ్యాట్స్‌మెన్లూ పాట్ కమ్మిన్స్ చేతికే చిక్కారు. వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ, సునీల్ నరైన్ ఒక్క వికెట్‌ను కూడా పడగొట్టలేకపోయారు.

బోరింగ్ సీన్లు ఎక్కువయ్యాయ్
కోల్‌కత నైట్ రైడర్స్ ఆటతీరు.. మాజీ ఆటగాళ్లను తీవ్రంగా నిరాశకు గురి చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో ఆడట్లేదని మొహమాటం లేకుండా చెబుతున్నారు. నైట్ రైడర్స్ ఆటతీరు మరీ బోరింగ్‌గా తయారవుతోందని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ముఖం మీదే చెప్పేశాడు. ఆ జట్టు ఆటతీరు తనను తాను జీర్ణించుకోలేకపోతున్నానంటూ క్రిక్‌బజ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

బ్యాటింగ్ లైనప్ మార్చాలి..
గత మ్యాచ్‌లో ఇవాన్ మోర్గాన్ గాడిలో పడినట్టు కనిపించినప్పటికీ.. మళ్లీ అదే తప్పు చేసి అవుట్ అయ్యాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. మేనేజ్‌మెంట్ తీసుకునే కొన్ని నిర్ణయాలు జట్టు బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బ తీస్తున్నాయని తాను అంచనా వేస్తున్నట్లు చెప్పాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. ఆ వనరులను సరిగ్గా వినియోగించుకోలేకపోతోందనేది స్పష్టమౌతోందని అన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం వల్లే కొన్ని బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని తేల్చి చెప్పాడు.


Click it and Unblock the Notifications
