న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు: ఒకరి చేతిని మరొకరు, భూటాన్ ట్రిప్‌లో విరుష్క జోడీ

All in reflections: Virat and Anushka hold hands in new pics from Bhutan trip

హైదరాబాద్: ఇద్దరూ కలిసే ప్రయాణిస్తున్నారు. కలిసే ఉంటున్నారు. ఈ సామెత విరుష్క జోడీకి చక్కగా సరిపోతుంది. ప్రస్తుతం ఈ జోడీ భూటాన్‌లో పర్యటిస్తోంది. ఇద్దరు కూడా వారికి ఎక్కువగా ఇష్టపడేదానినే చేస్తున్నారు. అదేంటో తెలుసా? ఒకటి జంతువులతో సరదాగా గడపడం, రెండోది దేశ సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడం.

ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ పర్యటనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ ఫోటోల్లో భూటాన్‌లోని ఓ సరస్సు మరియు పర్వతాల సుందరమైన దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క మరియు విరాట్ కోహ్లీ ఒకరినినొకరు చేతులు పట్టుకొని కనిపించారు.

<strong>రోహిత్‌కు 100వ టీ20: రెండో టీ20లో పంత్, అయ్యర్, ధావన్ సాధించే మైలురాళ్లివే!</strong>రోహిత్‌కు 100వ టీ20: రెండో టీ20లో పంత్, అయ్యర్, ధావన్ సాధించే మైలురాళ్లివే!

కోహ్లీ ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు

ఈ ఫోటోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన విరాట్ కోహ్లీ "ప్రకృతి సౌందర్యానికి దగ్గరగా రావడానికి మీకు అవకాశం వచ్చినప్పుడు, ఆలోచనలు ఆగిపోతాయి. ఆ మీరు క్షణంతో ఒకటవుతారు. ఆ సమయంలోనే మీరు దైవిక శక్తితో కలిసిపోతారు. సో గ్రేట్‌పుల్" అంటూ కామెంట్ పెట్టాడు.

వీడియోని పోస్టు చేసిన అనుష్క శర్మ

మరోవైపు అనుష్క శర్మ కూడా ఓ వీడియోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ వీడియోలో విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వైపు చూస్తుండగా... అనుష్క పర్వతాల దృశ్యాన్ని చిత్రీకరించింది. ప్రస్తుతం విరుష్క జోడీ భూటాన్‌లో అద్భుతమైన సమయం గడుపుతున్నారు. భూటాన్‌లోనే తన పుట్టినరోజును జరుపుకున్నాడు.

ప్రకృతి అందాలకు, స్వచ్ఛతకు మరో పేరు భూటాన్

ప్రకృతి అందాలకు, స్వచ్ఛతకు, ప్రశాంతతకు మరో పేరైన భూటాన్ లోయలో హాయిగా గడిపాడు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా అందరి ప్రశంసలు అందుకుంటోన్న విరాట్ కోహ్లీ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించాడు. 2008 ఆగస్టు 18న శ్రీలంక ప్రత్యర్థిగా వన్డే అరంగేట్రం చేసిన విరాట్ కొహ్లీ తన తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.

కోహ్లీ అరుదైన ఘనత

ఆ మరుసటి ఏడాదే వన్డే క్రికెట్లో తన తొలి సెంచరీ సాధించిన విరాట్ కొహ్లీ ఆ తర్వాత వెనుదిరగలేదు. భారత్ తరుపున ఇప్పటివరకు 239 వన్డేలాడిన కోహ్లీ 11,520 పరుగులు సాధించాడు. ఇందులో 43 సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు అత్యంత వేగంగా 10వేలు, 20వేల పరుగుల మైలురాళ్లు చేరిన తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

సచిన్ తర్వాత విరాట్ కోహ్లీనే

సచిన్ తర్వాత విరాట్ కోహ్లీనే

82 టెస్టుల్లో 7066 పరుగులు, 72 టీ20ల్లో 2450 పరుగులు సాధించాడు. వన్డేల్లో కోహ్లీ మరో ఏడు సెంచరీలు సాధిస్తే వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డుని బద్దలు కొడతాడు. టెస్టుల్లో 26 సెంచరీలతో సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు.

Story first published: Thursday, November 7, 2019, 15:28 [IST]
Other articles published on Nov 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X