Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌: సింధు, సైనాలకు కఠినమైన డ్రా

All England Badminton Championships 2019: Sindhu, Saina, Srikanth handed tough draws

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు కఠినమైన డ్రా ఎదురైంది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మార్చి 6న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సుంగ్‌ హ్యున్‌ (కొరియా)తో ఐదో సీడ్‌ సింధు తలపడుతుంది.

ఇక, 8వ సీడ్‌ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో క్రిస్టీ గిల్మూర్‌ (స్కాట్లాండ్‌)తో తలపడుతుంది. క్వార్టర్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, వరల్డ్ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సైనా నెహ్వాల్ తలపడే అవకాశముంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో బ్రైస్‌ లెవెర్‌దెజ్‌ (ఫ్రాన్స్‌)తో ఏడో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ తలపడనున్నాడు.

తొలి రౌండ్‌ దాటితే రెండో రౌండ్లో శ్రీకాంత్‌కు జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో తలపడే అవకాశం ఉంది. తొలి రౌండ్ అధిగమిస్తే క్వార్టర్స్‌లో వరల్డ్ నెంబర్‌వన్‌ కెంటొ మొమొట (జపాన్‌)తో శ్రీకాంత్‌ పోటీపడే అవకాశముంది. మిగతా తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సాయి ప్రణీత్‌తో ప్రణయ్‌, విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌)తో సమీర్‌వర్మ పోటీపడనున్నాడు.

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో షువాన్యి- షియాన్యు (చైనా)తో సుమీత్‌రెడ్డి- మను అత్రి తలపడనుండగా... మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో తనక- కొహరు (జపాన్‌)తో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప తలపడనున్నారు.

Story first published: Wednesday, February 13, 2019, 11:59 [IST]
Other articles published on Feb 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+