2nd ODI: నెట్స్‌లో ధోని ముందు కోహ్లీ చిందులు, నవ్విన కేఎల్ రాహుల్ (వీడియో)

హైదరాబాద్: ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను ప్రపంచకప్ సన్నాహకంగా భావిస్తున్న కోహ్లీసేన హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా రెండో వన్డేకు సన్నద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య మంగళవారం నాగ్‌పూర్ వేదికగా రెండో వన్డే జరుగనుంది.
ఈ నేపథ్యంలో విదర్భ క్రికెట్ స్టేడియంలో భారత ఆటగాళ్లు రెండో వన్డే కోసం సోమవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో కోచ్, సహాయ సిబ్బంది పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేశారు. రెండో వన్డేకు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉత్సాహంగా కనిపించాడు. ప్రాక్టీస్ సమయంలో చిందులేశాడు.

నెట్‌లో ప్రాక్టీస్ చేసిన ధోని
నెట్‌లో ప్రాక్టీస్ చేసిన ధోని.. ఆ తర్వాత నెట్ సెషన్ నుంచి వెళ్లిపోయేందుకు కిట్ బ్యాగ్‌లో తన బ్యాట్స్‌ను సర్దుతుండగా.. అప్పుడే అక్కడికి వచ్చిన కోహ్లీ సరదాగా ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. దానికి ధోనీ కూడా ఫన్నీగా సమాధానం ఇవ్వడంతో కోహ్లీ పడిపడి నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. అది వైరల్ అయింది.
ఆహ్లదకరంగా కనిపించిన ధోని
ఈ వీడియోలో విదర్భ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌ను ఆస్వాదిస్తూ కోహ్లీ ఆహ్లదకరంగా కనిపించాడు. పక్కనే ఉన్న కేఎల్ రాహుల్, ధోనితో జోకులు వేస్తూ.. చిందులేసాడు. కోహ్లీ డ్యాన్స్‌కు ధోని, రాహుల్ ముఖంలో నవ్వులు పూసాయి. తొలి వన్డేలో పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగిన కోహ్లీసేన ఆస్ట్రేలియాపై అన్నింటా ఆధిపత్యం చెలాయించింది.

మధ్యాహ్నం 1.30 నుంచి రెండో వన్డే మొదలు
ఈ సిరీస్‌తో కేఎల్ రాహుల్, రిషభ్‌పంత్, విజయ్ శంకర్, సిద్దార్థ్ కౌల్‌ల వరల్డ్‌కప్ భవితవ్యం తేలనుంది. టీ20 సిరీస్‌ను వరుస పరాజయాలతో కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. నాగ్‌పూర్ వేదికగా మంగళవారం మధ్యాహ్నం 1.30 నుంచి రెండో వన్డే మొదలు కానుంది.

రెండో వన్డేకు భారత జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, విజయ్ శంకర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, కేదార్ జాదవ్, యజువేంద్ర చాహల్, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications