
ఇండియా షెడ్యూల్ ఇదే..
ఇక ఐసీసీ ప్రపంచకప్‌లో మొత్తం 45మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ అక్టోబర్ 16వ తేదీన శ్రీలంక వర్సెస్ నమీబియా మధ్య జరగనుంది. ఇకపోతే సూపర్ 12లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో అక్టోబర్ 23వ తేదీన మెల్ బోర్న్ స్టేడియం వేదికగా తలపడనుంది.
ఇకపోతే ఇండియా షెడ్యూల్ గనుక చూసుకుంటే..
అక్టోబరు 23 - భారత్ vs పాకిస్థాన్ - మధ్యాహ్నం 1:30గం - MCG, మెల్‌బోర్న్
అక్టోబర్ 27: భారత్ vs A2 - 12:30pm - SCG, సిడ్నీ
అక్టోబర్ 30: భారత్ vs దక్షిణాఫ్రికా - సాయంత్రం 4:30 - పెర్త్ స్టేడియం, పెర్త్
నవంబర్ 2: భారత్ vs బంగ్లాదేశ్ - మధ్యాహ్నం 1:30 - అడిలైడ్ ఓవల్, అడిలైడ్
నవంబర్ 6: భారతదేశం vs B1 - 1:30pm - MCG, మెల్ బోర్న్

వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఆడే సిరీస్‌లు ఇవే
ఇకపోతే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ నవంబర్ 13వ తేదీన జరగనుంది. అంతకంటే ముందు అన్ని జట్లూ పలు టీ20 సిరీస్‌లను ఆడనున్నాయి. ఇక భారత్ కూడా కొన్ని టీ20 సిరీస్‌లను ఆడుతోంది. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాతో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో ముగించుకుంది.
ఇక భారత్ ఆడబోయే అప్ కమింగ్ టీ20 సిరీస్‌లను ఒకసారి పరిశీలిస్తే..
భారత్ vs ఐర్లాండ్ - 2 మ్యాచ్‌లు - జూన్ 26 నుండి జూన్ 28 వరకు
ఇండియా vs ఇంగ్లాండ్ - 3 మ్యాచ్‌లు - జూలై 7 నుండి జూలై 10 వరకు
ఇండియా vs వెస్టిండీస్ - 3 మ్యాచ్‌లు - 29 జూలై నుండి 2 ఆగస్టు వరకు
ఆసియా కప్ T20 ఆగస్టు 27న ప్రారంభమవుతుంది (ఇంకా అధికారికంగా తేదీలు ప్రకటించలేదు)

నాలుగు అవకాశాలే మిగిలాయి
ఇక టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియాకు మరో నాలుగు సిరీస్‌లు ఉన్నాయి. అంటే టీమిండియా తుది జట్టును ఎంపిక చేయడానికి మరో నాలుగు అవకాశాలున్నాయన్నమాట. ఇక ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, ఛీప్ సెలెక్టర్ చేతన్ శర్మ ఎలాంటి జట్టును ఎంపిక చేయనుందో ఈ నాలుగు సిరీస్లో ప్లేయర్ల ప్రదర్శన బట్టి తెలియనుంది.
ఇకపోతే గత టీ20 ప్రపంచకప్లో లీగ్ స్టేజ్‌లోనే టీమిండియా ఇంటి బాట పట్టడం పట్ల అభిమానులు పూర్తి నిరాశ చెందారు. ఇక ఈసారి టీమిండియా నాకౌట్ స్టేజ్లోకి వెళ్లాలని... వరల్డ్ కప్ సాధించడం కూడా ఇండియా జట్టు వల్ల అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఐపీఎల్ పుణ్యమా అని ఇండియాకు బొచ్చేడు టీ20 ప్లేయర్లున్నారు.
అందువల్ల సెలెక్షన్లో ఎవరిని ఉంచాలి.. ఎవరిని దించాలి అనేది కత్తిమీద సాము లాంటిదే. ఎందుకంటే.. కొందరు ప్లేయర్లు తమదైన రోజున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడేవాళ్లే ఏదేమైనా టీ20 ప్రపంచకప్‌కు బెస్ట్ టీం సిద్ధమవడం ఖాయం.


Click it and Unblock the Notifications
