న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ పచ్చబొట్టు వెనుక భావాలివే

All 9 Virat Kohli tattoos and their meanings explained

న్యూ ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఆటలోనే కాదు.. ట్రెండ్‌లోనూ ముందుంటాడు. యువత అభిరుచులకు తగ్గట్లుగా ఉంటుంది అతడి లైఫ్ స్టైల్. భుజాల నుంచి మణికట్టు దాకా కోహ్లి రెండు చేతులపైనా పచ్చబొట్లు నిండిపోయి ఉంటాయి. అతడి ఒంటిపై ఉన్న తొమ్మిది పచ్చ బొట్ల వెనుకా అతని ఆంతర్యం కనబడుతుంది. అనుబంధాల్ని, అభిరుచుల్ని, ఆలోచన విధానాన్ని సూచించేలా పచ్చబొట్లు వేయించుకున్నాడు కోహ్లి.

సరోజ్‌, ప్రేమ్‌ పేర్లతో పచ్చబొట్లు

సరోజ్‌, ప్రేమ్‌ పేర్లతో పచ్చబొట్లు

కోహ్లి జబ్బలపై సరోజ్‌, ప్రేమ్‌ అక్షరాలతో ఉన్న పచ్చబొట్లు చూడొచ్చు. అవి అతడి తల్లిదండ్రుల పేర్లు. విరాట్‌ మూడో ఏటే తన తండ్రిని కోల్పోయాడు. అప్పట్నుంచి తల్లి కష్టపడి పెంచింది. ‘తల్లిదండ్రులతో నా బంధం గురించి మాటల్లో చెప్పలేను. నేను జీవించినంత కాలం వారితో నా బంధం గురించి చెప్పడానికి వారి పేర్లతో పచ్చబొట్టు వేయించుకున్నా' అని విరాట్‌ చెప్పాడు.

మానస సరోవరంలోని శివుడి బొమ్మను

మానస సరోవరంలోని శివుడి బొమ్మను

కోహ్లి ఎడమ మోచేతి కింద మానస సరోవరంలో ఉన్న శివుడిని సూచించే బొమ్మను పచ్చబొట్టు వేయించుకున్నాడు. శివ తత్వాన్ని తాను అనుసరిస్తానని.. జీవితంలో కొన్ని ఎదురు దెబ్బల్ని తట్టుకుని మెరుగైన వ్యక్తిగా మారడానికి ఆ తత్వమే ఉపకరించిందని కోహ్లి చెబుతాడు.

క్రికెట్‌ మైదానం అనే ఆశ్రమానికి అంకితం

క్రికెట్‌ మైదానం అనే ఆశ్రమానికి అంకితం

శివుడి చిత్రానికి పక్కలోనే ఒక ఆశ్రమాన్ని సూచించే చిత్రం ఉంది. తాను క్రికెట్‌ మైదానం అనే ఆశ్రమానికి అంకితం అయ్యానని చెప్పడానికి, ఆటలో స్ఫూర్తి పొందేందుకు కోహ్లి ఈ చిత్రాన్ని టాటూగా వేయించుకున్నాడు.

చేతులపై 175, 269 అంకెలతో పచ్చబొట్లు

చేతులపై 175, 269 అంకెలతో పచ్చబొట్లు

కోహ్లి చేతులపై 175, 269 అంకెలతో పచ్చబొట్లున్నాయి. భారత క్రికెట్‌ చరిత్రలో వన్డే అరంగేట్రం చేసిన 175వ ఆటగాడు కోహ్లి. టెస్టులాడిన 269వ భారత ఆటగాడతను. అందుకే ఈ అంకెలతో టాటూలు వేయించుకున్నాడు.

కుడి జబ్బపై ఇంగ్లిష్‌ అక్షరాల్లో ‘స్కార్పియో’

కుడి జబ్బపై ఇంగ్లిష్‌ అక్షరాల్లో ‘స్కార్పియో’

కోహ్లి కుడి జబ్బపై ఇంగ్లిష్‌ అక్షరాల్లో ‘స్కార్పియో' అని రాసిన పచ్చబొట్టుంది. అతడి రాశి వృశ్చికం. ఈ రాశి లక్షణాలు తనలో ఉన్నాయంటాడు విరాట్‌. అందుకే ఈ టాటూ వేసుకున్నాడు.

ఎడమ చేతిపై జపాన్‌ యోధుడి..

ఎడమ చేతిపై జపాన్‌ యోధుడి..

విరాట్‌ ఎడమ చేతిపై జపాన్‌ యోధుడిని సూచించే పెద్ద పచ్చబొట్టుంది. ఒక యోధుడు కావడానికి ఉండాల్సిన ఏడు లక్షణాల్ని ఈ టాటూ తనకు గుర్తు చేస్తుందని.. ఆ లక్షణాలు తనలో ఉండేలా చూసుకుంటానని అంటాడు కోహ్లి.

కుడి భుజంపై వృత్తాకార పచ్చబొట్టు

కుడి భుజంపై వృత్తాకార పచ్చబొట్టు

విరాట్‌ కుడి భుజంపై కంటిని సూచించే వృత్తాకార పచ్చబొట్టుంది. ఇది దేవుడి కన్ను అన్నది కోహ్లి ఉద్దేశం. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా దేవుడు చూస్తుంటాడని.. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈ పచ్చబొట్టు వేయించుకున్నానని కోహ్లి వెల్లడించాడు.

ఓంకారం గుర్తుతో మరో టాటూ

ఓంకారం గుర్తుతో మరో టాటూ

కోహ్లి భుజంపై దేవుడి కంటిని సూచించే పచ్చబొట్టు పైనే ఓంకారం గుర్తుతో మరో టాటూ ఉంది. విశ్వంలో అత్యంత నిలకడైన శబ్ధం ఇదే అని.. జీవిత పరమార్థం ఇందులోనే ఉందని.. మనం ఈ విశ్వంలో చిన్న రేణువంత కూడా కాదని.. అహం వీడి సాధారణంగా జీవించడానికి ప్రయత్నించాలన్న సూత్రాన్ని ఈ పచ్చబొట్టు గుర్తు చేస్తుందని కోహ్లి అన్నాడు.

తొలిసారి వేయించుకున్న పచ్చబొట్టు

తొలిసారి వేయించుకున్న పచ్చబొట్టు

విరాట్‌ తొలిసారి వేయించుకున్న ఈ పచ్చబొట్టు ఒక గిరిజన కళను సూచించేది. ఇది దూకుడును ఉద్దేశించినదట. తన శరీరంపై మరిన్ని టాటూలు వేయించుకునేలా స్ఫూర్తినిచ్చింది ఇదే అంటాడు కోహ్లి.

Story first published: Wednesday, September 26, 2018, 11:23 [IST]
Other articles published on Sep 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X