ప్రపంచకప్ నుండి అలెక్స్ హేల్స్ ఔట్

ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ప్రపంచకప్ ప్రిలిమినరీ జట్టు నుండి తొలగించబడ్డాడు. ఈ మేరకు సోమవారం ఇంగ్లాండ్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకటనలో తెలిపింది. డ్రగ్స్ తీసుకున్న కారంగానే అలెక్స్ హేల్స్‌పై 21 రోజుల పాటు నిషేధం విధించాం అని ఈసీబీ అధికారి ఎడ్ స్మిత్ తెలిపారు.
నిషేధం కారణంగా అలెక్స్ హేల్స్ 21 రోజుల పాటు ఎటువంటి క్రికెట్ ఆడరాదు. దీంతో ప్రపంచకప్ ప్రిలిమినరీ జట్టు నుండే కాకుండా ఐర్లాండ్, పాకిస్థాన్ సిరీస్‌ల నుండి కూడా హేల్స్‌ను తప్పించారు. అయితే ఇతని స్థానంలో జేమ్స్ విన్స్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
'ఇది చాలా కఠిమైన నిర్ణయం. దీనిపై చాలా అలోచించాం. ఇంగ్లాండ్ బోర్డులో మంచి వాతావరణం సృష్టించేందుకు ఇలా చేసాం. ఇంగ్లాండ్ ఆటగాడిగా అలెక్స్ కెరీర్ ముగిసిపోలేదు. ఈసీబీ, పీసీఏలు అతనితో కలిసి పనిచేస్తాయి. అన్ని విధాలుగా అతనికి అండగా ఉంటాం' అని ఈసీబీ అధికారి గిల్స్ తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications