Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మోత మోగించిన స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ.. శతకాలతో హడలెత్తిన స్టేడియం

శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో రెండు అద్భుత సెంచరీలు నమోదయ్యాయి. ఆసీస్‌ వికెట్‌కీపర్‌ కమ్ బ్యాటర్‌ ఆలెక్స్‌ క్యారీ, తాత్కాలిక కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ శతక్కొట్టారు. ఈ సెంచరీలతో పలు రికార్డులను నమోదు చేశారు.

కెరీర్ లో రెండో సెంచరీ..
ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బరిలోకి దిగాడు క్యారీ. 118 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో తన కెరీర్ లో రెండో టెస్ట్‌ శతకాన్ని పూర్తి చేశాడు. మొత్తంగా రెండో రోజు ఆట ముగిసేసరికి 156 బంతుల్లో 139* పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. అంతకుముందు క్యారీ తన తొలి టెస్ట్‌ శతకాన్ని 2022 బాక్సింగ్‌ డే టెస్ట్‌లో బాదాడు. మళ్లీ రెండో శతకం బాదటానికి ఇంత సమయం పట్టింది.

Alex Carry and Steve Smith hits centuries in ongoing AUS VS SL 2nd Test

ఇదే మ్యాచ్ లో స్టీవ్‌ స్మిత్‌ కూడా అద్భుత సెంచరీ బాదాడు. టెస్ట్‌ల్లో స్మిత్‌కు ఇది 36వ శతకం కావడం విశేషం. టెస్ట్‌ కెప్టెన్‌గా ఇది 17వ సెంచరీ. 191 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో ఈ శతకాన్ని పూర్తి చేశాడు. మొత్తంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 239 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 120 పరుగులు చేశాడు. లంక పర్యటనలో స్మిత్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం మరో విశేషం. తొలి మ్యాచ్‌లోనూ స్మిత్‌ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే.

జో రూట్ రికార్డ్ సమం..
ఇక ఈ తాజా శతకంతో స్మిత్‌ ఇంగ్లాండ్ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ రికార్డును కూడా సమం చేశాడు. రూట్‌ 36 శతకాలతో స్మిత్‌ సమంగా నిలిచాడు. ఫాబ్‌ ఫోర్‌లో స్మిత్‌, రూట్‌ చెరో 36 సెంచరీలు చేయగా.. కేన్‌ విలియమ్సన్‌ 33, విరాట్‌ కోహ్లీ 30 శతకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలానే ఈ శతకంతో స్మిత్‌.. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్‌, రూట్‌ శతకాలతో సమంగా నిలిచాడు. ఈ జాబితాలో ఐదో స్థానంలో చోటు సంపాదించుకున్నాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్‌ తెందుల్కర్ (51) పేరిట ఉంది.

Story first published: Friday, February 7, 2025, 18:21 [IST]
Other articles published on Feb 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+