న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరోన్ ఫించ్ ఘోరంగా విఫలం: మద్దతుగా నిలిచిన వైస్ కెప్టెన్

Alex Carey backs Aaron Finch to deliver, defends Glenn Maxwell at No 7

హైదరాబాద్: కోహ్లీసేనతో జరిగే చివరి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ చెలరేగుతాడని ఆ జట్టు వైస్ కెప్టెన్ అలెక్స్ క్యారీ ధీమా వ్యక్తం చేశాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 11 బంతులు ఎదుర్కొన్న అరోన్ ఫించ్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔటయ్యాడు.

<strong>బీబీఎల్: బిల్లీ స్టాన్‌లేక్ కామెడీ రనౌట్ వీడియోని చూశారా?</strong>బీబీఎల్: బిల్లీ స్టాన్‌లేక్ కామెడీ రనౌట్ వీడియోని చూశారా?

అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం రెండో వన్డే ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం అలెక్స్ క్యారీ మీడియాతో మాట్లాడుతూ "ఆస్ట్రేలియా టీమ్‌‌లో గర్వించదిగిన ఆటగాళ్లలో అరోన్ ఫించ్ కూడా ఒకరు. అతను భారీ స్కోరుతో జట్టుకి విజయాన్ని అందించడం ద్వారా ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నాడు" అని అన్నాడు.

"నెట్స్‌లో అతను శ్రమిస్తున్న తీరు చూస్తుంటే? తప్పకుండా భారత్‌‌పై చివరి రెండు వన్డేల్లో భారీ స్కోరు సాధించేలా కనిపిస్తోంది. మైదానంలోనే కాదు.. వెలుపల కూడా అతను మంచి నాయకుడు" అని అలెక్స్ క్యారీ అన్నాడు. అయితే, ఆరోన్ ఫించ్ భారత్‌తో అంతకముందు జరిగిన టీ20, టెస్టు సిరిస్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు.

ఆరోన్ ఫించ్ చివరగా ఆడిన 11 ఇన్నింగ్స్‌ల్లో అతడి అత్యధిక స్కోరు 47 కాగా.. ఏకంగా ఏడు సార్లు 7 పరుగులలోపే పెవిలియన్ చేరడం విశేషం. జింబాబ్వేతో గతేడాది జూలైలో జరిగిన టీ20లో కేవలం 76 బంతుల్లోనే 172 పరుగులు చేసిన ఫించ్.. ఆ తర్వాత ఇప్పటి వరకూ అన్ని ఫార్మాట్లలో కలిపి 25 ఇన్నింగ్స్‌లు ఆడి రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.

Story first published: Monday, January 14, 2019, 14:06 [IST]
Other articles published on Jan 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X