Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

322: వరల్డ్ రికార్డు నెలకొల్పిన పాక్ అంఫైర్ అలీమ్ దార్

హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన అంఫైర్ అలీమ్ దార్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. 48 ఏళ్ల అలీమ్ దార్ కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు అంఫైర్‌గా వ్వవహరించడంతో అత్యధిక మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన వ్యక్తిగా రికార్డు సాధించాడు.

మూడు ఫార్మెట్లలో కలిపి ఇప్పటి వరకు 332 మ్యాచ్‌లకు అంఫైర్‌గా వ్యవహరించాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి దక్షిణాఫ్రికా అంపైర్ రూడీ కొర్ట్‌జన్ పేరిట ఉన్న (311 మ్యాచ్‌లు) రికార్డును అలీమ్ దార్ అధిగమించాడు. ప్రస్తుతం కెప్ టౌన్‌ టెస్టు అలీమ్ దార్‌కు 109వ టెస్టు కావడం విశేషం.

రెండో స్ధానంలో అలీమ్ దార్

రెండో స్ధానంలో అలీమ్ దార్

ఇప్పటివరకు అలీమ్ దార్ 109 టెస్టులు, 182 వన్డేలు, 41 టీ20లు మ్యాచ్‌లకు అంఫైరింగ్ చేశారు. అత్యధిక టెస్టులకు అంఫైరింగ్ చేసిన వ్యక్తిగా జమైకాకు చెందిన స్టీవ్ బక్నర్ 128 టెస్టులతో మొదటి స్ధానంలో నిలవగా 109 టెస్టులతో అలీమ్ దార్ రెండో స్ధానంలో నిలిచాడు.

స్టీవ్ బక్నర్ 128 టెస్టుల రికార్డు బద్దలయ్యే ఛాన్స్

స్టీవ్ బక్నర్ 128 టెస్టుల రికార్డు బద్దలయ్యే ఛాన్స్

ఇదిలా ఉంటే అలీమ్ దార్ మరికొంత కాలం అంఫైరింగ్ చేసే అవకాశం ఉండటంతో స్టీవ్ బక్నర్ 128 టెస్టుల అంపైరింగ్ రికార్డుని బద్దలు కొట్టే అవకాశం కూడా ఉంది. అలీమ్ దార్ 2000 ఏడాది అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా కెరీర్ ప్రారంభి 15 ఏళ్లకు పైగా ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు.

405 మ్యాచ్‌లకు అంపైరింగ్

405 మ్యాచ్‌లకు అంపైరింగ్

ఇక మొత్తంగా ఆయన 405 మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయగా, ఇందులో 332 మ్యాచ్‌ల్లో ఆన్ ఫీల్డ్‌లో ఉండగా 73 మ్యాచ్‌లకు టీవీ అంపైర్‌గా పనిచేశారు. ఐసీసీ అంపైర్ల ప్యానల్‌లో భాగస్వామిగా ఉన్న అలీమ్ దార్ 2009, 2010, 2011లలో వరుసగా మూడేళ్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కైవసం చేసుకున్నారు.

2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ అలీమ్ దార్

2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లోనూ అలీమ్ దార్

2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్‌లోనూ అలీమ్ దార్ అంపైర్ బాధ్యతలు నిర్వహించారు. క్రికెట్ పట్ల దార్ చేసిన సేవలకు గాను పాకిస్థాన్ ప్రభుత్వం ఆగస్టు 14, 2010న ప్రైడ్ ఆఫ్ ఫెర్పామెన్స్‌తో సత్కరించింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+