England vs Southafrica : కాస్త మారండి అంటూ ఇంగ్లాండ్ టీంపై సీరియస్ అయిన అలెస్టర్ కుక్

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమి పాలయిన ఇంగ్లాండ్ టీంకు చీవాట్లు పెట్టాడు. దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్‌కు సరైన ప్రాక్టీస్ కూడా చేసుకోకుండా ఎలా బరిలోకి దిగారంటూ మండిపడ్డాడు. అయితే డీన్ ఎల్గర్ నేతృత్వంలోని సౌతాఫ్రికా జట్టు బలమైన ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ ద్వారా సౌతాఫ్రికాకు మంచి ప్రాక్టీస్ లభించింది. ఇంగ్లాండ్ లయన్స్ చేతిలో సౌతాఫ్రికా ఇన్నింగ్స్, 56పరుగుల తేడాతో ఓడిపోయినా.. టెస్ట్ పరిస్థితులకు అనువుగా టీం ప్లాన్ మార్చుకుని తొలి టెస్ట్‌కు రెడీ అయ్యి విజయం సాధించింది.
అయితే ఇంగ్లాండ్ మాత్రం ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే బరిలోకి దిగి మూల్యం చెల్లించుకుంది. అందువల్ల ఇంగ్లాండ్ సన్నద్ధతపై కుక్ తన సందేహాలను వెలువరించాడు. బీబీసీతో మాట్లాడిన కుక్.. రెడ్ బాల్ క్రికెట్‌తో టచ్‌లో ఉండాలంటే.. దానికంటూ తగిన ప్రాక్టీస్ ఉండాలని.. ప్లేయర్లు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాలని పేర్కొన్నాడు.

మొదటి మ్యాచ్‌లో ఈసారి జరిగింది విడ్డూరం
'సాధారణంగా టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు మొదటి మ్యాచ్‌లో అన్ని రకాల ప్రయోజనాలుంటాయి. పరిస్థితులు, పిచ్, కండీషన్లు అన్నీ కూడా కలిసొస్తాయి. పైగా స్వదేశం కాబట్టి మాకు కాస్త ఎడ్జ్ ఉంటుంది. అయితే ఈసారి జరిగింది మాత్రం విడ్డూరం. మా జట్టు టెస్టు ఆటతీరును వేరే రకంగా మార్చుతాం అనే మాటలు మాట్లాడుతోంది.
అది ఇప్పుడు అనవసరం. నేను అడుగుతున్నా మనం ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడాలి. సరైన ప్రాక్టీస్ ఉన్నప్పుడే కదా.. ఆ విషయాన్ని జట్టు మర్చిపోతుంది. టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతున్నప్పుడు అంతకుముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌పై ప్లేయర్లు ఆసక్తి చూపట్లేదని స్పష్టమవుతుంది' అని కుక్ పేర్కొన్నాడు.

ముందు అది మారాలి
ఇక 'బాజ్‌బాల్' ఫిలాసఫీని ఇంగ్లాండ్ ప్రవేశపెట్టిన తర్వాత.. ఇంగ్లాండ్ తొలిసారి టెస్ట్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓటమికి ఎలాంటి సాకులు చెప్పకూడదని, ఏదైనా ప్రధాన టెస్ట్ సిరీస్‌లకు ముందు ఫస్ట్-క్లాస్ గేమ్‌లపై ప్లేయర్లు ఎక్కువ దృష్టి పెట్టాలని కుక్ అభిప్రాయపడ్డాడు. 'నేరుగా గ్రౌండ్లోకి వెళ్లి ఆడాలనుకోవడం కరెక్ట్ కాదు. అది మారాలి' అని కుక్ ఖరాఖండిగా చెప్పాడు. ఇంగ్లాండ్ ఆగస్టు 25న దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడనుంది. మూడో టెస్టు సెప్టెంబర్ 8న ప్రారంభం కానుంది.

రఫ్ఫాడించిన రబాడ
తొలి టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ మెరుపుదాడికి తెగబడ్డాడు. అతను మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసి రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 165పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 326పరుగుల స్కోరు చేసి 161పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లలో అలెక్స్ లీస్ (35), స్టువర్ట్ బ్రాడ్ (35) మినహా మిగతావాళ్లు తుస్సుమనిపించారు. దీంతో 149పరుగులకే ఆ జట్టు చాప చుట్టేసింది. తద్వారా ఇన్నింగ్స్ 12పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications