అలెస్టర్ కుక్ సూపర్ మ్యాన్ క్యాచ్: బంతిని చూడకుండానే పట్టేశాడు
హైదరాబాద్: అలెస్టర్ కుక్.... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్‌ను ఒకానొక దశలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. క్రికెటర్‌గా ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు. ప్రత్యేకంగా స్లిప్ క్యాచ్‌లను అందుకోవడంలో కుక్ దిట్ట అని క్రికెట్ విశ్లేషకులు అంటుంటారు.
తానేమిటో నిరూపించుకున్న కుక్
బంతి గమనాన్ని అంచనా వేయలేకపోవడం లేదా ఒత్తిడితో చాలా మంది క్రికెటర్లు క్యాచ్‌లు నేలపాలు చేసే సందర్భాలు అనేకం. అయితే తాజాగా అలెస్టర్ కుక్ మరోసారి తన మెరుగు ఫీల్డింగ్‌తో తానేమిటో నిరూపించుకున్నాడు. నమ్మశక్యం కాని రీతిలో కుక్ పట్టిన క్యాచ్ అతని పాత రోజుల్ని గుర్తు చేసింది.
రయ్ మంటూ దూసుకొచ్చిన బంతి
అసలు బంతి వైపు చూడకుండానే తనను ఇంటర్యూ చేస్తున్న వ్యక్తి వైపు రయ్ మంటూ దూసుకొచ్చిన బంతిని కుక్ అద్భుతంగా ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు. ఇటీవల కౌంటీ క్రికెట్ లో భాగంగా ఇంగ్లండ్ లోని ఒక స్థానిక గ్రౌండ్ లో ఎసెక్స్ బ్యాట్స్ మన్ అయిన కుక్ ను ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నాడు.
బంతిని హిట్ చేసిన యువ క్రికెటర్
అదే సమయంలో పక్కనే పలువురు క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ యువ క్రికెటర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ బంతిని హిట్ చేశాడు. ఆ బంతి అలెస్టర్ కుక్‌ని ఇంటర్య్యూ చేస్తున్న వ్యక్తి వైపు వేగంగా వచ్చింది. దీనికి అంతే వేగంగా స్పందించిన కుక్..ఆ బంతిని చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నాడు.
కుక్ లేకపోయి ఉంటే
ఒకవేళ అక్కడ కుక్ లేకపోయి ఉంటే ఇంటర్య్వూ చేసే వ్యక్తికి ఆ బంతి బలంగా తాకేది. మెరుపు వేగంతో స్పందించిన కుక్ ఒంటిచేత్తో దాన్ని అందుకుని మళ్లీ ఇంటర్వ్యూని కొనసాగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంటర్యూ చేస్తున్న వ్యక్తి ప్రాణాన్ని కుక్ కాపాడంటూ పలువురు నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications