For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ 'పదివేల' రికార్డ్ బద్దలు కొట్టిన అలిస్టర్ కుక్

By Srinivas

న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డును ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్సుమెన్, ఆ దేశ టెస్ట్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ బద్దలు కొట్టాడు. రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడిన సచిన్ పేరిట ఎన్నో రికార్డులు లిఖితమై ఉన్నాయి. అందులో పదివేల మైలు రాయి ఒకటి. దీనిని కుక్ బద్దలు కొట్టాడు.

అత్యంత చిన్న వయసులో టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాడిగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ రికార్డు సృష్టించాడు. అతను 31 ఏళ్ల 157 రోజుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇప్పటిదాకా సచిన్‌ టెండుల్కర్ (31 ఏళ్ల 326 రోజులు) పేరిట ఈ రికార్డు ఉంది.

సోమవారం లంకతో ముగిసిన రెండో టెస్టులో అలిస్టర్ కుక్‌ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌ తరఫున పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు అతనే కావడం గమనార్హం. దుర్హాంలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో 47 పరుగులు చేసిన కుక్ ఈ మార్కు చేరుకున్నాడు.

Alastair Cook surpasses Sachin Tendulkar as fastest to 10k runs in Tests

2005లో 31 ఏళ్ల 326 రోజుల వయసులో ఉండగా కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సచిన్ ఈ మార్కు అందుకున్నాడు. తాజాగా అతడి కంటే చిన్న వయసులోనే కుక్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. 158 టెస్టుల్లోనే కుక్ ఈ మార్కును చేరుకున్నాడు. ఇక టెస్టుల్లో పదివేల పరుగులు చేసిన బ్యాట్స్ మెన్లలో కుక్ 12వ ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

ఇదిలా ఉండగా, రెండో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసిన ఇంగ్లాండ్‌ మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. నాలుగో రోజు 309/5తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక 475 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్‌ ముందు 79 పరుగుల లక్ష్యం నిలవగా ఒకే వికెట్‌ కోల్పోయి ఛేదించింది. కుక్‌ 47 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+