సెంచరీ వీరుడు: కుక్‌కి కోహ్లీ కంగ్రాట్స్, ట్విట్టర్‌లో ప్రశంసలు
రాజ్‌కోట్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ సరికొత్త రికార్డుని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో 136 టెస్టు ఆడిన అలెస్టర్ కుక్ రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (194 బంతుల్లో 10 ఫోర్లు)తో సెంచరీ సాధించాడు.
టెస్టుల్లో ఇది కుక్‌కు 30వ సెంచరీ కావడం విశేషం. 243 బంతులను ఎదుర్కొన్న కుక్ 130 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కుక్ ఔటైన అనంతరం ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఐదో రోజైన ఆదివారం 114/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది.
మరో ఓపెనర్ హమీద్ 82, రూట్ 4, స్టోక్స్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మిశ్రా 2, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. అంతక ముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 49 పరుగుల ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో 260 పరుగులకే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో భారత్ ముందు 310 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
అయితే తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడం ద్వారా కుక్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. భారత్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. టీమిండియాపై కుక్ 6 సెంచరీలు చేశాడు. అయితే కుక్‌కి ఇది భారత్‌లో ఐదో టెస్టు సెంచరీ.
ఇప్పటివరకు ఏ విదేశీ ఆటగాడు భారత్‌లో నాలుగు సెంచరీలు మించి చేయలేదు. దీంతో కుక్ తన క్రికెట్ కెరీర్‌లో మరో ఘనతను సాధించినట్లైంది. అంతేకాదు భారత గడ్డపై టెస్టుల్లో 1000కి పైగా పరుగులు చేసిన నాల్గవ విదేశీ ఆటగాడిగా కుక్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు.
భారత గడ్డపై మరో ఘనతను సొంతం చేసుకున్న కెప్టెన్ కుక్‌పై ట్విట్టర్‌లో ప్రశంసలు కురిపిస్తున్నారు.
కుక్ సెంచరీల రికార్డుపై ట్విట్టర్‌లో ప్రశంసలు
క్రికెట్ అభిమానులు కుక్‌ను ఎలా ప్రశంసలతో ముంచెత్తుతున్నారో మీరే చూడండి.
ఇంగ్లాండ్ కెప్టెన్ అద్భుత సెంచరీపై ప్రశంసలు
నాగ్ పూర్, అహ్మదాబాద్, రాజ్ కోట్ టెస్టులో ఇలా అంటూ కుక్‌పై ప్రశంసలు.
తొలి టెస్టులో కుక్ సెంచరీ
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడం ద్వారా కుక్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. భారత్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. టీమిండియాపై కుక్ 6 సెంచరీలు చేశాడు. అయితే కుక్‌కి ఇది భారత్‌లో ఐదో టెస్టు సెంచరీ.
తొలి టెస్టు: 243 బంతులను ఎదుర్కొని 130 పరుగులు
243 బంతులను ఎదుర్కొన్న కుక్ 130 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కుక్ ఔటైన అనంతరం ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
కుక్‌ను అభినందిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
సెంచరీ సాధించిన ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్‌ని అభినందిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
కుక్ రికార్డుపై ట్విట్టర్‌లో ప్రశంసలు
ఇప్పటివరకు ఏ విదేశీ ఆటగాడు భారత్‌లో నాలుగు సెంచరీలు మించి చేయలేదు. దీంతో కుక్ తన క్రికెట్ కెరీర్‌లో మరో ఘనతను సాధించినట్లైంది. అంతేకాదు భారత గడ్డపై టెస్టుల్లో 1000కి పైగా పరుగులు చేసిన నాల్గవ విదేశీ ఆటగాడిగా కుక్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications